(Source: ECI/ABP News/ABP Majha)
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్ వేదికగా సదరన్ రైజింగ్ సమ్మిట్ - ఈవెంట్లో పాల్గొని ప్రసంగించనున్న ప్రముఖులు వీరే
ABP Southern Rising Summit : శతాబ్దం ఘనమైన చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక ఏబీపీ నెట్ వర్క్ అక్టోబర్ 25న హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్ నిర్వహిస్తోంది.
ABP Network Southern Rising Summit 2024 | ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ తో మరోసారి మీ ముందుకొస్తుంది. గత ఏడాది చెన్నైలో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఏడాది 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'కు హైదరాబాద్ వేదికగా మారింది. అక్టోబర్ 25న పార్క్ హయత్ లో జరగనున్న ఈ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. దేశంలో దక్షిణాదితో ముడిపడిన అంశాలను, ఎడ్యుకేషన్, హెల్త్, కల్చర్ లాంటి అంశాలపై వక్తలు ఈ వేదిక ద్వారా ప్రసంగించనున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార, క్రీడా, సినీ ఇతర రంగాల కళాకారులను ఏబీపీ నెట్ వర్క్ ఒకే వేదికగా మీదకు మరోసారి తీసుకువస్తోంది.
ఈ ఏడాది నిర్వహిస్తున్న ఏబీపీ నెట్ వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్ థీమ్ "Coming of Age: Identity, Inspiration, Impact". హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ సమ్మిట్ లో దక్షిణాది సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పురోగతి.. తద్వారా అది దేశ పురోగతిలో పోషించిన పాత్రపై పలు రంగాల ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత్‌లో జనాభా విషయానికొస్తే దక్షిణాది రాష్ట్రాల్లో 20 శాతం మంది ఉంటారు. కానీ దేశ జీడీపీలో 31 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. అంటే దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాదిన ఇలాగే డెవలప్ అయితే 2030 నాటికి మన దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 35 శాతానికి చేరే అవకాశం ఉంది.
సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు పలు రంగాల ప్రముఖులు
సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, డీఎంకే ఎంపీ డాక్టర్ కనిమొళి ఎన్‌విఎన్ సోము, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహమ్మద్, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, ఆల్ ఇంగ్లండ్ పురుషుల సింగిల్స్ మాజీ ఛాంపియన్ - పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోష్న తిరునగరి, బీజేపీ నాయకురాలు మాధవీలత, సినీ ప్రముఖులు గౌతమి తాడిమళ్ల, ప్రకాష్ రాజ్, సాయి దుర్ఘ తేజ్, రాశి ఖన్నా, సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్ చిదంబరం ఎస్. పొదువాల్ వంటి ప్రముఖులు ఈ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు.
శాస్త్రీయ గాయని బిందు సుబ్రమణ్యం, అవార్డ్ విన్నింగ్ సింగర్ శిల్పా రావు, మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత క్లాసికల్ డ్యాన్సర్ యామిని రెడ్డి, రచయిత- చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ లతో పాటు రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంక, SaPa సీఈవో, కో ఫౌండర్, సింగర్ బిందు సుబ్రమణ్యం, థియేటర్ ఆర్టిస్ట్, నటుడు మహమ్మద్ అలీ భేగ్, ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా వంటి ప్రముఖులు సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.