అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్

ABP Southern Rising Summit : శతాబ్దం ఘనమైన చరిత్ర ఉన్న ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ నిర్వహిస్తోంది. దక్షిణాది స్ఫూర్తి, ప్రభావం, ఐడెంటిటీని దేశం మొత్తానికి మరోసారి చూపించనునంది.

ABP Southern Rising Summit 2024: దేశంలో దక్షిణాదికి ఓ ప్రత్యేకత ఉంది. అభివృద్ధిలో ముందడుగు వేయడం, ప్రాంతీయ ప్రత్యేకతలను నిలుపుకోవడమే కాదు ప్రతి రంగంలోనూ ఇప్పుడు దక్షిణాది పురోగమిస్తోంది. దక్షిణాది అభివృద్ధిని దేశానికి చాటిచెప్పేలా ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో రెండో సదరన్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.   "Coming of Age: Identity, Inspiration, Impact" థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 

2023లో సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ప్రస్తుత డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సహా భిన్నరంగాలకు చెందిన అనేక మంది  ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో దేశం ముందుకెళ్తున్న వైనం, అందులో దక్షిణాది పాత్రపై విశేషంగా చర్చించారు. ఈ ఏడాది ఈ సమ్మిట్ ను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమ్మిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 

దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇరవై శాతం మంది జనాభా ఉంటారు. దేశం మొత్తం జీడీపీలో 31 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. అంటే భారత ఎకానమీకి దక్షిణాది రాష్ట్రాలు కీలకమైనవి అనుకోవచ్చు.  2030 నాటికి భారత జీడీపీలో దక్షిణాది వాటా 35 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఉత్తరభారతంతో పోలిస్తే దేశంలో  దక్షిణాదిన ఎక్కువ చైతన్యంగా ఉంటారు. కుటుంబనియంత్రణ పాటించారు.  దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండడమే దీనికి కారణం అదేనని  డేటా సైంటిస్ట్ ఆర్‌ఎస్ నీలకందన్ విశ్లేషించారు.   దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే దక్షిణ భారతదేశంలో శిశు మరణాల రేటు తక్కువగా ఉంటుంది.  పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో మరణించే అవకాశం చాలా తక్కువ. బిడ్డకు టీకాలు వేయించే అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది.  ఇక్కడ పిల్లలకు సేవలు ,  చిన్నతనంలో అద్భుతమైన పోషకాహారం అందుతాయని అందుకే దక్షిణాది యువత చురుకుగా ఉంటారన్నారు. 

దక్షిణాదిలో సినిమా పరిశ్రమ కూడా మంచి పురోగతి సాధించింది.  వ్యాపారంలోనూ దక్షిణాదికి చెందిన వారు అంతర్జాతీయంగా అత్యుత్తమ కంపెనీల్లో అత్యున్నత స్థానానికి వెళ్తున్నారు.  వాటి మూలాలతో బలంగా ముడిపడి ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ ఉన్నత స్థానంలోనే ఉంటాయని అనుకోవచ్చు. 

కేంద్ర ప్రభుత్వంలోనూ ఇప్పడు దక్షిణాది పార్టీలదే కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాల్లో  కొత్తగా ఎన్నికైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు,  ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక ఐక్యత, విద్య , ఆరోగ్యంపై పెట్టుబడి వంటి వినూత్న పాలనా నమూనాలను అందించడానిక ప్రయత్నిస్తున్నాయి.  

25వ తేదీన సదరన్ రైజింగ్ దక్షిణాది ఆశలు, ఆకాంక్షలను మరోసారి వ్యక్తపరచనుంది. దక్షిణాదిలో ఏబీపీ నిర్వహిస్తున్న రెండో సమ్మిట్   “Coming of Age: Identity, Inspiration, Impact” ధీమ్‌తో రాజకీయ, సాంస్కృతి, ఆర్థిక, సోషల్ డెవలప్‌మెంట్స్ పై చర్చిస్తుంది.  

అక్టోబర్ 25, 2024న సదరన్ రైజింగ్ సమ్మిట్ లో చేంజ్ మేకర్స్, విజరనీస్ ఆఫ్ సౌత్ ఇండియాలో వస్తున్న మార్పులు..జరగాల్సిన అభివృద్ది .. మెరుగైన భవిష్యత్ కోసం ఏబీపీ లైవ్‌ను ఫాలో అవ్వండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులిఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Embed widget