KTR Good Heart : రాజకీయ నేత కావాలని ఆ బాలిక లక్ష్యం - కేటీఆరే రోల్ మోడల్ ! ఆయనే కలిసేందుకు పిలిస్తే ?
రాజకీయ నాయకురాలు కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓ బాలిక కేటీఆర్ ను కలవాలనుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలిసిన వెంటేన కేటీఆర్ స్పందించారు.
KTR Good Heart : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఎంతో మందికి సోషల్ మీడియా ద్వారా సాయం చేస్తూంటారు. ఈ సాయం ఎక్కువగా వ్యక్తిగత సమస్యల గురించే ఉండవచ్చు కానీ.. కొన్ని సార్లు స్ఫూర్తి నింపేలా ఉంటుంది. అలాంటి ఓ ప్రత్యేక సందర్భంగా తాజాగా చోటు చేసుకుంది. కేటీఆర్ అంటే అమితమైన అభిమానం చూపే ఓ బాలిక తన భవిష్యత్ లక్ష్యాన్ని రాజకీయ నేతగా ఎదగాలని నిర్దేశించుకుంది. పదో తరగతి చదువుతున్న వైష్ణవి అనే బాలిక తన అభిప్రాయాలు, భావాలతో పుస్తకాలు కూడా ప్రచురిస్తోంది. ఆమె కేటీఆర్ ను కలవాలనుకుంటోందని ఇలా ఒకరు ట్వీట్ చేయగానే.. అలా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు.
A 10th grade Vaishnavi wants to meet @KTRTRS and share her books The Jaz Gang- A Dangerous Escapade. Her future inspiration is becoming a politician and follow dynamic leader like @KTRTRS#35thHyderabadNationalBookFair pic.twitter.com/csnrgV6EJO
— Deepika Pasham (@pasham_deepika) December 22, 2022
ప్రస్తుతం హైదరాబాద్‌లో 35వ నేషనల్ బుక్ ఫెయిర్ జరుగుతోంది. తాను రాసిన పుస్తకాలను వైష్ణవి ఆ బుక్ ఫెయిర్ లో ఆవిష్కరించారు.
తనను ఆ బాలిక కలవాలనుకుంటోందని తెలిసిన వెంటనే కేటీఆర్.. సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం శుభపరిణామమన్నారు. వ్యక్తిగతం ఆమె అభిప్రాయాలను వినాలనుకుంటున్నానని..తన టీం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Happy to hear that a young girl wants to join the most maligned & abused political brigade 😁
— KTR (@KTRTRS) December 22, 2022
Vaishnavi, my team @KTRoffice will get in touch with you. Look forward to hearing more from you in person https://t.co/JpFwS2kcZJ
దీనికి కేటీఆర్ ఆపీస్ టీం కూడా రిప్లై ఇచ్చింది.
Noted sir.
— Office of KTR (@KTRoffice) December 22, 2022
కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా అనేక మందికి ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా తన వంతు ప్రయత్నాలు చేస్తూంటారు. ఇప్పుడు రాజకీయం అంటే.. అంతా అదో నేరం అన్నట్లుగా మారిపోయింది. కానీ పిల్లల్లో రాజకీంయం అంటే స్పష్టమైన అభిప్రాయాలు ఉంటున్నాయి. అలాంటి వారిని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్‌లో మంచి రాజకీయ నేతలు.. యువత తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కేటీఆర్ ఓ మంచి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు.