Telangana Omicron Cases: తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు.. ఎలాంటి ప్రయాణాలూ చేయని వారిలో వేరియంట్!
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. 62కి చేరింది. అయితే మెుత్తం ఒమిక్రాన్ బాధితుల్లో.. 46 మంది టీకాలు తీసుకోలేదు. ఇందులోనూ.. ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరాణ అయింది. అయితే మెుదట్లో.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే.. ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రయాణాలు లేని వాళ్లలో కూడా.. వేరియంట్ ను గుర్తించారు.
మరోవైపు ఒమిక్రాన్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి క్రిస్మిస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం తెలిపింది. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది.
జనవరి 2 వరకూ ఆంక్షలు
Also Read: Corona Updates: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి