Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి
తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా.. ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 97,113 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,980 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో పరిధిలో 1,439 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. కొవిడ్ నుంచి నిన్న ఒక్కరోజే 2,398 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,673 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 94.89 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా వైరస్ శాంతించినట్లు కనిపిస్తోంది. నిన్నటితో పోల్చితే దేశంలో 27,469 పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. ఈ క్రమంలో వరుసగా ఐదోరోజూ కరోనా కేసులు 3 లక్షలకు పైగా నిర్ధారణ అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,06,064 (3 లక్షల 6 వేల 64) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 439 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మందికి ఇప్పటివరకూ కరోనా సోకింది. 55.9 లక్షల మందిని కొవిడ మహమ్మారి బలిగొనగా.. 979 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారని ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.
Also Read: Harish Rao Letter: తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి.. కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ..
Also Read: Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే ఛాన్స్