అన్వేషించండి

గత మూడేళ్లలో భారత కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ నుంచి ఎన్ని వేలకోట్లు కొల్లగొట్టారో తెలుసా!

YouTube Content Creators: గత సంవత్సరం 100 మిలియన్లకు పైగా భారతీయ ఛానెళ్ళు యూట్యూబ్ లో కంటెంట్ అప్లోడ్ చేశాయి. 15,000 కంటే ఎక్కువ ఛానెళ్ళకు 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.

YouTube CEO Neal Mohan: భారత్‌లో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు మామూలుగా కాదు. పెద్ద మొత్తంలోనే సంపాదిస్తున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (Youtube) భారతీయ ‘కంటెంట్’ క్రియేటర్స్, ఆర్టిస్టులు, మీడియా సంస్థల అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కంటెంట్ క్రియేటర్లపై ఏకంగారూ.850 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యూట్యూబ్ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ (YouTube CEO Neal Mohan) గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత 3 సంవత్సరాలలో యూట్యూబ్ భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లకు, ఆర్టిస్టులు, మీడియా సంస్థలకు దాదాపు రూ.21,000 కోట్లకు పైగా చెల్లించినట్లు ఆయన తెలిపారు.

భారత్‌లో ₹850 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న యూట్యూబ్

గత ఏడాది భారతదేశంలో క్రియేట్ చేసిన వీడియో కంటెంట్‌ను విదేశాలలో ఉన్న యూజర్లు ఏకంగా ఆ వీడియోలను 45 బిలియన్ గంటల పాటు చూశారు. ఇక్కడ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా నీల్ మోహన్ మాట్లాడారు. ‘వచ్చే 2 సంవత్సరాలలో భారత్ కు చెందిన యూట్యూబ్ క్రియేటర్లు,  కళాకారులు, మీడియా సంస్థల అభివృద్ధిలో భాగంగా ఏకంగా ₹850 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

10 కోట్లకు పైగా కంటెంట్ అప్‌లోడ్

భారత్‌కు చెందిన ‘కంటెంట్ క్రియేటర్లు’ దేశ ప్రత్యేకతను తమ క్రియేషన్ ద్వారా చూపిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారితో అయినా మన చరిత్ర, సంస్కృతిని, టాలెంట్ షేర్ చేసుకునే ప్లాట్‌ఫాం యూబ్యూబ్ కల్పిస్తోందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టిగల నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు ఒక సాధనంగా డిజిటల్ ఫ్లాట్‌ఫాం మారింది. డిజిటల్ ఇండియాతో భారత్ ను మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు.

‘ప్రధానమంత్రి మోదీ యూట్యూబ్‌లో 2.5 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోని ఏ నేతకు లేని స్థాయిలో యూట్యూబ్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారని నీల్ మోహన్ అన్నారు. ఆయన భారతదేశాన్ని క్రియేటివ్ పరంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ఏడాది దేశంలోని 10 కోట్లకు పైగా చానెళ్ళు యూట్యూబ్‌లో ‘కంటెంట్ అప్‌లోడ్’ చేశాయని, అందులో 15,000 కంటే ఎక్కువ చానళ్లకు 10 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

విజయవంతమైన వ్యాపారాలకు హెల్ప్ అయింది- నీల్ మోహన్ 

కొన్ని నెలల కింద ఉన్న 11,000 చానెళ్ళ కంటే ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్లు తమ టాలెంట్ ప్రదర్శిస్తూ మరింత ఎదగాలని, అందుకు యూట్యూబ్ వేదిక కావాలని నీల్ మోహన్ ఆకాంక్షించారు. విజయవంతంగా ఎన్నో వ్యాపారాలను నిర్వహించడంలో సహాయపడుతోందని అన్నారు.

గత 3 సంవత్సరాలలో భారత్‌లోని కంటెంట్ క్రియేటర్లు, నటీనటులు, మీడియా సంస్థలకు ₹21,000 కోట్లకు పైగా చెల్లించామని.. ఇది పెద్ద మార్కెట్ అన్నారు. ఏ ప్రదేశంలోని కంటెంట్ క్రియేటర్ అయినా ప్రపంచవ్యాప్తంగా తమకు ఫాలోయర్లు సంపాదించుకుంటారు. యూట్యూబ్‌ను ఒక శక్తివంతమైన ఇంజిన్‌గా మార్చడంతో కొన్ని దేశాలు మాత్రమే భారతదేశంలాగ ఫలితాలు పొందుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా చేయనున్న ఇన్వెస్టి‌మెంట్ ద్వారా దేశంలో కంటెంట్ క్రియేటర్లు మరింత మార్కెట్ చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget