IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో హర్మన్‌ప్రీత్ కౌర్ లీడర్‌షిప్‌లోని ఇండియాకు అత్యంత కీలకమైన మ్యాచ్ రానే వచ్చింది. లండన్ వేదికగా ఆదివారం జరగబోయే లాస్ట్ గ్రూప్-A మ్యాచ్‌లో సిక్స్-టైమ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడనుంది. ఇది ఇండియాకు ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది.
గ్రూప్ సినారియో చూస్తే.. లార్డ్స్‌లో జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌పై గెలిస్తే, ఇండియా సెమీస్ వెళ్లాలంటే అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాల్సిందే. ఒకవేళ ఓడిపోతే వన్డే వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఇండియా టోర్నీ నుంచి అవుట్ అవుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఏమైనా మిరాకిల్ చేసి సౌతాఫ్రికాను ఓడిస్తే.. ఆసీస్ చేతిలో ఓడినా నెట్ రన్ రేట్ ఆధారంగా ఇండియాకు ఛాన్స్ ఉంటుంది.
ఇండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఫామ్‌లోకి రావడం ప్లస్ పాయింట్. కానీ హర్మన్‌ప్రీత్, జెమిమాతో కూడిన మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్స్, అలాగే లాస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా 6 ఈజీ క్యాచులు డ్రాప్ చేయడం టీమ్‌ను వేధిస్తోంది. రాధా యాదవే 3 క్యాచులు వదిలేయడం షాకింగ్. ఆసీస్‌పై ఇలాంటి తప్పులు చేస్తే కంబ్యాక్ ఇవ్వడం కష్టమని కోచ్ అమోల్ ముజుందార్ హెచ్చరించాడు. మరి మన అమ్మాయిలు ఆసీస్‌ను ఓడించి సెమీస్ వెళ్తారా? మీ ప్రిడిక్షన్‌ను కింద కామెంట్ చేయండి.
ట్రెండింగ్ వార్తలు






















