అన్వేషించండి

Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  

Notice To Telegram: ఈ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద సంఖ్యలో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర కాపీరైట్ హక్కులున్న మెటీరియల్ షేర్ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం టెలిగ్రామ్‌కు నోటీసు; ఆన్‌లైన్ పైరసీ నియంత్రణకు ఆదేశం.
  • పైరసీ కంటెంట్ తొలగించి, పటిష్టమైన నిరోధక వ్యవస్థను రూపొందించాలి.
  • పునరావృత నేరస్థులపై చర్యలు తీసుకొని, 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి.

Notice To Telegram: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో ఇటీవల యూజర్‌నేమ్‌లు అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడం విస్తృత చర్చకు దారితీసింది. ఈ అంశం యూజర్‌నేమ్‌లపై విస్తృత ప్రశ్నలను రేకెత్తించడంతో, ప్రభుత్వం ఈ ఫీచర్‌ను నిషేధించింది. వాట్సాప్ తర్వాత, ప్రభుత్వం ఇప్పుడు టెలిగ్రామ్‌కు కూడా నోటీసు జారీ చేసింది.

వాస్తవానికి, భారత్‌లో ఆన్‌లైన్ పైరసీని అరికట్టడానికి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన టెలిగ్రామ్‌పై కఠిన వైఖరి తీసుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌కు ఒక నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా తమ పైరసీ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, తీసుకున్న చర్యలపై ఒక నివేదికను సమర్పించాలని ఆ నోటీసులో ఆదేశించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై పెద్ద సంఖ్యలో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర కాపీరైట్ హక్కులున్న మెటీరియల్ షేర్ అవుతున్నాయని, దీనివల్ల సినీ పరిశ్రమకు, క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాలు కలుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వం టెలిగ్రామ్‌తో ఏమని చెప్పింది?

అందిన సమాచారం ప్రకారం, తమ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న పైరసీ చిత్రాలు, కాపీరైట్ ఉల్లంఘన ఆడియో-వీడియో కంటెంట్‌ను గుర్తించడం, వాటి గురించి రిపోర్ట్ చేయం, తొలగించడం కోసం ఒక పటిష్టమైన పద్ధతిని సిద్ధం చేయాలని మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌కు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.

అంతేకాకుండా, ఫిర్యాదు అందిన తర్వాత కేవలం కంటెంట్‌ను తొలగించడం సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. ప్లాట్‌ఫారమ్‌లే స్వయంగా అటువంటి కంటెంట్‌ను గుర్తించి, సకాలంలో దాన్ని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ఫిర్యాదుల పరిష్కారానికి డిమాండ్

సమాచార -ప్రసార మంత్రిత్వ శాఖ, టెలిగ్రామ్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా కోరింది. పైరసీ కంటెంట్‌పై చిత్రనిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రసారకర్తలు, చట్ట అమలు సంస్థలు ఎలా ఫిర్యాదులు చేయవచ్చో, అలాగే ఆ ఫిర్యాదులను ఎంత వేగంగా పరిష్కరిస్తారో ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది.

పునరావృత నేరస్థులపై చర్య

పదేపదే పైరసీ కంటెంట్‌ను షేర్ చేసే వినియోగదారులు, నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం టెలిగ్రామ్‌ను కోరింది. ఇందులో వ్యక్తిగత ఖాతాలు మాత్రమే కాకుండా ఛానెళ్లు, గ్రూపులు, బాట్‌లు, అడ్మిన్‌లు వాటికి సంబంధించిన నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌ల పైరసీ కాపీలను నిరంతరం పంపిణీ చేసే మొత్తం నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికే ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది.  

15 రోజుల్లోగా నివేదిక 

15 రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదిక (ATR)ను సమర్పించాలని ప్రభుత్వం టెలిగ్రామ్‌ను ఆదేశించింది. పైరసీ కంటెంట్‌ను గుర్తించడం, నిరోధించడం, తొలగించడం కోసం ఆ ప్లాట్‌ఫారమ్ తీసుకున్న చర్యలను ఈ నివేదికలో వివరించాలి. నిర్దేశించిన సమయంలోగా నివేదికను సమర్పించని పక్షంలో, ప్రభుత్వం ప్రస్తుత చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.  

ఐటీ చట్టం -కాపీరైట్ చట్టం కింద బాధ్యత

భారత్‌లో మధ్యవర్తిగా, ఐటీ చట్టం, 2000, ఐటీ నియమాలు, 2021 ప్రకారం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని ప్రభుత్వం టెలిగ్రామ్‌కు తెలియజేసింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ క్రియేటర్ ఎకానమీ, సినీ పరిశ్రమ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాడ్‌కాస్టర్లు, చిత్రనిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే ఈ చర్య లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పైరసీ కంటెంట్ సులభంగా లభించడం వల్ల కంటెంట్ సృష్టికర్తలకు ఆర్థిక నష్టాలు కలగడమే కాకుండా, పరిశ్రమపై కూడా ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. అందువల్ల, ప్లాట్‌ఫారమ్ స్థాయిలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది.

Frequently Asked Questions

టెలిగ్రామ్‌కు ప్రభుత్వం నోటీసు ఎందుకు ఇచ్చింది?

భారతదేశంలో ఆన్‌లైన్ పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసు జారీ చేసింది. టెలిగ్రామ్‌లో పైరసీ సినిమాలు, ఇతర కాపీరైట్ కంటెంట్ ఎక్కువగా షేర్ అవుతున్నాయి.

టెలిగ్రామ్ ఏమి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది?

తమ ప్లాట్‌ఫామ్‌లో పైరసీ కంటెంట్‌ను గుర్తించి, నివేదించి, తొలగించడానికి ఒక బలమైన వ్యవస్థను సిద్ధం చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఫిర్యాదులు లేకుండానే కంటెంట్‌ను తొలగించాలని సూచించింది.

టెలిగ్రామ్ నివేదిక సమర్పించడానికి ఎంత గడువు ఉంది?

టెలిగ్రామ్‌కు 15 రోజుల గడువు ఉంది. ఈ వ్యవధిలోగా పైరసీని నియంత్రించడానికి తీసుకున్న చర్యలపై వివరణాత్మక కార్యాచరణ నివేదికను సమర్పించాలి.

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget