Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్ పర్యటనలోనే డెబ్యూ ఖాయమనుకున్నా, రెండు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భద్రతా కారణాల దృష్ట్యా హోటల్‌లో తల్లిదండ్రులతో ప్రత్యేక గది, విడిగా డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేసినా.. గంభీర్, అయ్యర్ అతనికి అవకాశం ఇవ్వకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ సిరీస్ లో టీమిండియా టాపార్డర్ చేసిన ఘోర వైఫల్యాలు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి దారులు క్లియర్ చేశాయి. ఐర్లాండ్ సిరీస్‌లో విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వరుసగా డకౌట్లు కావడం, ఇషాన్ కిషన్ కేవలం 12 పరుగులకే రనౌట్ అవ్వడం జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పుడు మార్పుల వైపు చూస్తోంది.
ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కఠినమైన బ్రిటన్ పిచ్‌లపై, ఇంగ్లాండ్ బౌలింగ్‌పై వైభవ్‌ను బరిలోకి దించాలనేది గంభీర్ వ్యూహంగా కనిపిస్తోంది. మ్యాచ్ నాటికి గంభీర్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ట్రెండింగ్ వార్తలు






















