Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో ఊహించని భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. శ్రేయస్ అయ్యర్‌ను కొత్త సారథిగా నియమించారు. అయ్యర్‌కు కెప్టెన్‌గా తొలి సిరీస్ లోనే షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. టీమిండియా కోచింగ్ మార్పులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
శ్రేయస్ కెప్టెన్ అయ్యాడనే వార్త వినగానే, కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో రికీ పాంటింగ్ టీమిండియా కొత్త కోచ్‌గా వస్తాడేమో అని తనకు అనిపించిందంటూ వాన్ చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను ఆయన గుర్తుచేశాడు. శ్రేయస్, పాంటింగ్‌ల జోడీ ఎప్పుడూ కలిసే కనిపిస్తుందని పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌ను కూడా పక్కనపెట్టగల సత్తా ప్రపంచంలో ఒక్క భారత్‌కే సాధ్యమన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో హ్యారీ బ్రూక్ సేనపై భారత్‌దే పైచేయి అవుతుందని, కానీ ఐర్లాండ్ టూర్ లోని లోపాలను సరిదిద్దుకోవడంపై భారత్ దృష్టి పెట్టాలని వాన్ సూచించాడు. మరి గంభీర్ స్థానంలో నిజంగానే పాంటింగ్ వస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ట్రెండింగ్ వార్తలు






















