అన్వేషించండి

Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్

Deepa Thomas Reaction : సత్యదేవ్ రావు బహదూర్ సక్సెస్ ఈవెంట్‌లో హీరోయిన్ దీప థామస్ ఎమోషనల్ అయ్యారు. స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.

Rao Bahadur Actress Deepa Thomas Emotional Speech : టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా డిఫరెంట్ రోల్స్‌లో విభిన్న గెటప్పుల్లో సత్యదేవ్ నటనపై ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ సక్సెస్‌తో టీం ఫుల్ జోష్‌లో ఉంది. శనివారం సత్యదేవ్ బర్త్ డే కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరోయిన్ దీప థామస్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

'నా పేరెంట్స్ గర్వపడ్డారు'

రావు బహదూర్ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు దీప థామస్. ఈ మూవీలో ఆమె నర్స్ రేణుక పాత్రలో నటించారు. సత్యదేవ్ నటనతో పాటు పేరెంట్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. 'ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో సత్యదేవ్ ఒకరు. రావు బహదూర్‌లో డిఫరెంట్ రోల్స్‌లో ఆయన యాక్టింగ్ అద్భుతం. ఆయనతో కలిసి వర్క్ చేయడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాకు ఆయనకు కచ్చితంగా అవార్డు వస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు.

Also Read : Hang Man OTT : ఓటీటీలో బ్రహ్మాజీ 'హ్యాంగ్ మ్యాన్' - ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

'నమ్మలేకపోయా... అదే బెస్ట్ కాంప్లిమెంట్'

తాను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 9 ఏళ్లయిందని... ఇలాంటి గొప్ప ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో కలలు కన్నట్లు చెప్పారు దీప. ''కేరాఫ్ కంచరపాలెం' లాంటి క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడు మహా ఒక రోజు నాకు ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా ఆడిషన్ కోసం ప్రొఫైల్ పంపమన్నప్పుడు నన్ను నేను నమ్మలేకపోయా. రావు బహదూర్ సినిమాలో భాగం కావడమే నా జీవితంలో అత్యంత హ్యాపీయెస్ట్ డే. నాకు రేణుక పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ వెంకటేశ్‌కు రుణపడి ఉంటాను.

థియేటర్లలో ఒక్కో సీన్‌కు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమాలో కామెడీ మూమెంట్ వస్తే నవ్వుతున్నారు. ఎమోషనల్ మూమెంట్ వస్తే ఏడుస్తున్నారు. ప్రతీ ఎమోషన్‌కు కనెక్ట్ అవుతున్నారు. మా పేరెంట్స్‌కు తెలుగు రాదు. వాళ్లు సబ్ టైటిల్స్‌తో మూవీ చూశారు. ఈ మూవీ చూసి మా నాన్న 'కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ చేశావు' అని మెచ్చుకుంటే... నా జీవితంలో అత్యంత విలువైన కాంప్లిమెంట్ ఇది.' అంటూ ఎమోషనల్ అయ్యారు.  

'కేరాఫ్ కంచరపాలెం' ఫేం వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన మూవీలో సత్యదేవ్‌తో పాటు దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read : Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mrunal Thakur : ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Samantha Son : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget