అన్వేషించండి

Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Rao Bahadur Box Office Collection Day 1: సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన 'రావు బహదూర్'కు ఓవర్సీస్ ఓపెనింగ్ అదిరింది. మరి ఇండియాలో ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సత్యదేవ్ 'రావు బహదూర్' జూలై 3న విడుదలై మంచి ఓపెనింగ్స్.
  • మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ₹ 3.11 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది.
  • భారతదేశంలో ₹1.40 కోట్లు నెట్, హైదరాబాద్‌ ₹70.82 లక్షలు వసూలు చేసింది.
  • విదేశాల మార్కెట్ నుండి ₹1.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

Satyadev's Rao Bahadur Opening Day Box Office Collection: సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రావు బహదూర్'. జూలై 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. మొదటి రోజు బాక్సాఫీస్ బరిలో మంచి ఆరంభాన్ని అందుకుంది. యువ దర్శకుడు, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సైకలాజికల్ డ్రామా, మర్డర్ మిస్టరీ సినిమాకు ఓవర్సీస్ నుంచి మంచి ఓపెనింగ్ లభించింది. మరి ఇండియాలో? ఫస్ట్ డే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? వంటి వివరాలు తెలుసుకోండి.

నాగబంధం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?
Nagabandham First Day Collection Worldwide: ఇండియాలో కంటే విదేశాల్లో 'రావు బహదూర్'కు మొదటి రోజు మంచి వసూళ్ళు వచ్చాయి. విమర్శకుల నుంచి సినిమాకు ప్రశంసలు రావడం హెల్ప్ అయ్యింది. 'రావు బహదూర్' రివ్యూలలో ఇది కమర్షియల్ సినిమా కాదని, కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని పేర్కొనడం కూడా ప్లస్ అయ్యింది. మొదటి రోజు వసూళ్ళ వివరాలు చూస్తే...

  • 'రావు బహదూర్' సినిమాకు మొదటి రోజు ఇండియాలో రూ. 1.40 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
  • కర్ణాటకలో 13 లక్షలు, తమిళనాడు (చెన్నై)లో రెండు లక్షలు, రెస్టాఫ్ ఇండియా నుంచి మరో లక్ష గ్రాస్ వచ్చింది. దాంతో ఇండియా గ్రాస్ వసూళ్లు రూ. 1.61 కోట్లకు చేరాయి.
  • ఓవర్సీస్ మార్కెట్‌లో (Overseas) మొదటి రోజు రూ. 1.50 కోట్ల గ్రాస్ వచ్చింది.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'రావు బహదూర్' టోటల్ గ్రాస్ రూ. 3.11 కోట్లు.

Also Read: Nagabandham First Day Collections - నాగబంధం కలెక్షన్లు... ఫ్లాప్‌ టాక్‌తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

హైదరాబాద్ సిటీ కలెక్షన్స్ ఎక్కువ!
'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' తర్వాత సత్యదేవ్, వెంకటేష్ మహా కలిసి చేసిన సినిమా 'రావు బహదూర్'. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన రూ. 1.40 నెట్ కలెక్షన్లలో సగం కలెక్షన్స్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చాయి. 

హైదరాబాద్ సిటీలో 'రావు బహదూర్' సినిమాకు మొదటి రోజు 70.82 లక్షల గ్రాస్ వచ్చింది. మొదటి రోజు ఏవరేజ్ ఆక్యుపెన్సీ చూస్తే... 27.65 శాతం. మార్నింగ్ షోలకు 19 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా... నైట్ షోలకు 38.08 శాతం ఆక్యుపెన్సీ ఉండటం గమనార్హం.

Also ReadSuper Subbu Series Review And Rating - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో 'రావు బహదూర్' తెరకెక్కింది. చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. సత్యదేవ్‌ సరసన దీపా థామస్ నటించిన 'రావు బహదూర్' సినిమాలో వికాస్ ముప్పాల, ఆనంద్ భారతి, బాల పరాశర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతాన్ని, కార్తీక్ పర్మార్ ఛాయాగ్రహణాన్ని అందించారు. 

Also ReadGurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: పెళ్ళికి ముందు కుర్రాడు గజనీ అయితే? ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Frequently Asked Questions

'రావు బహదూర్' సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

'రావు బహదూర్' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.11 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విదేశాల నుండి మంచి ఓపెనింగ్ లభించింది.

'రావు బహదూర్' చిత్రం మొదటి రోజు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది?

సత్యదేవ్ నటించిన 'రావు బహదూర్' మొదటి రోజు ఇండియాలో రూ. 1.40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో సగం వసూళ్లు హైదరాబాద్ నగరం నుండే వచ్చాయి.

'రావు బహదూర్' సినిమాను ఎవరు దర్శకత్వం వహించారు? అది ఏ జానర్‌కు చెందిన చిత్రం?

'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా ఈ సినిమాను దర్శకత్వం వహించారు. ఇది ఒక సైకలాజికల్ డ్రామా మరియు మర్డర్ మిస్టరీ చిత్రం.

సూపర్ స్టార్ మహేష్ బాబు 'రావు బహదూర్' చిత్రంలో ఎలా పాలుపంచుకున్నారు?

'రావు బహదూర్' చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పించారు. చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget