Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
OTT Review - Gurthukosthunnayi On ETV Win: విరాజ్ అశ్విన్ హీరోగా రూపొందిన ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. జూలై 3 నుంచి స్ట్రీమింగ్. ఈ సిరీస్ నోస్టాల్జియాలోకి తీసుకు వెళ్ళిందా?
వినోద్ గాలి
విరాజ్ అశ్విన్, యశశ్రీ, ప్రియదర్శిని రామ్, శివన్నారాయణ, గోపరాజు రమణ, వైవా రాఘవ, సిద్ధూ పవన్, గోదావరి గోపి, రోహాణి హట్టంగడి, అనీష్ కురువిల్లా తదితరులు
ఈటీవీ విన్
ETV Win Original Series Gurthukosthunnayi Review In Telugu: 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. వినోద్ గాలి దర్శకత్వం వహించారు. శరత్ చంద్ర నాయుడు నిర్మించారు. విరాజ్ అశ్విన్ జంటగా యశశ్రీ రావు నటించగా... రోహిణి హట్టంగడి, శివన్నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. జూలై 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్. అయితే... జూలై 1న శ్రీరాములు థియేటర్‌లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Gurthukosthunnayi Web Series Story Explained In Telugu): సంతోష్ (విరాజ్ అశ్విన్)కు పెళ్లి కుదురుతుంది. స్కూల్‌లో తన క్లాస్‌మేట్ వైశాలి (యశశ్రీ రావు)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది. అయితే... వైశాలి తండ్రి, తన స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) ఒప్పుకోడు. ఆయన్ను ఎట్టకేలకు ఒప్పించి ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతాడు. స్నేహితులు గణేష్ (వైవా రాఘవ), శ్రీకాంత్ (సిద్ధూ పవన్), ఆనంద్ (గోదావరి గోపి)కి విషయం చెబుతాడు. గోవాలో బ్యాచిలర్స్ పార్టీ అడుగుతారు.
జాతకం ప్రకారం మూడు రోజులు హైదరాబాద్ సిటీ దాటి బయటకు వెళ్ళకూడదని నాన్నగారు చెప్పారని సంతోష్‌కు వైశాలి చెబుతుంది. రఘునాథ్ మాటను కూడా లెక్క చేయకుండా స్నేహితులతో కలిసి గోవా వెళతాడు సంతోష్. దారిలో గేదె అడ్డు వస్తుంది. దాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేస్తాడు. స్టీరింగ్‌కు తల గట్టిగా తగలడంతో గతం మర్చిపోతాడు.
సంతోష్ సమస్యను దాచి, గతాన్ని మర్చిపోయాడని చెప్పకుండా పెళ్లి చేయాలని తండ్రి (శివన్నారాయణ), స్నేహితులు నిర్ణయించుకుంటారు. అయితే... సంతోష్ సమస్య డాక్టర్ అయినటువంటి రఘునాథ్ స్నేహితుడు అయ్యప్ప స్వామి (అనీష్ కురువిల్లా)కు తెలుసు. కాబోయే అల్లుడికి ఓ యాక్సిడెంట్ అయ్యిందని, గతం మర్చిపోయాడని పోలీస్ కంటే డేంజర్ అయిన రఘునాథ్‌కు తెలిసిందా? గజినీలా మారిన సంతోష్ ఏం చేశాడు? సంతోష్ చేసే పనుల వల్ల తల్లిదండ్రులు, స్నేహితులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? విశాలికి అయినా అసలు విషయం చెప్పారా? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Gurthukosthunnayi Web Seires Telugu Review): 'గుర్తుకొస్తున్నాయి... గుర్తుకొస్తున్నాయి' - రవితేజ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్'లో పాట. ఆ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నోస్టాల్జియా మూమెంట్స్ టచ్ చేశారు. ఈటీవీ విన్ హిట్ సిరీస్ '90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' కూడా ఆనాటి రోజులు గుర్తు చేసింది. మరి, లేటెస్ట్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' ప్రత్యేకత ఏమిటి? ఇందులో ఏముంది?
'గుర్తుకొస్తున్నాయి'... ముందు ఈ టైటిల్ గురించి చెప్పాలి. సిరీస్ చూసేటప్పుడు 2003 నుంచి 2007 మధ్యలో స్కూల్‌కు వెళ్లిన వీక్షకులకు అప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ జస్టిఫికేషన్ అయితే... సిరీస్‌లో హీరో గతం మర్చిపోతాడు కనుక... అది గుర్తుకు రావడం కథ పరమైన జస్టిఫికేషన్. రెండు విధాలుగా టైటిల్ సెట్ అయ్యింది. టైటిల్ ఒక్కటే కాదు... కథతో పాటు సన్నివేశాలు కూడా భలే సెట్ అయ్యాయి.
సింపుల్ కథతో 'గుర్తుకొస్తున్నాయి...' సిరీస్ తెరకెక్కించారు. ఆ సింప్లిసిటీలో ప్రతి వీక్షకుడి మనసును టచ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 30లలో ఉన్న ప్రేక్షకులను ఒక్కసారిగా స్కూల్ ఏజ్‌లోకి తీసుకు వెళ్లే మేజిక్ కథ, కథనం, దర్శకత్వంలో ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్‌లో చేసిన అల్లరితో పాటు అప్పటి ప్రేమలు, మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుంది. నోస్టాల్జియా మూమెంట్స్ కంటే సిట్యువేషనల్ ఫన్ ఎక్కువ వర్కవుట్ అయ్యిందీ సిరీస్‌లో.
కథగా చూస్తే... 'గుర్తుకొస్తున్నాయి' కొత్తది ఏమీ కాదు. తమిళంలో విజయ్ సేతుపతి ఈ తరహా కథతో ఓ సినిమా చేశారు. మంచు మనోజ్ 'నేను మీకు తెలుసా?' కూడా వచ్చింది. అయితే... కథలు వేర్వేరు. కథనంతో పాటు వినోదం ఆకట్టుకుంటుంది. హీరో గతం మర్చిపోయిన తర్వాత ఆ విషయాన్ని దాచడానికి తండ్రితో పాటు స్నేహితులు పడే పాట్లు నవ్విస్తాయి. చివరి ఎపిసోడ్‌లో ఎమోషన్స్ కూడా టచ్ చేస్తాయి.
శ్రీరాములులో 'గుర్తుకొస్తున్నాయి' చూస్తున్నప్పుడు... సినిమా చూస్తున్న అనుభూతి కలగడానికి ప్రధాన కారణం పాటలే. సిరీస్‌లోని ప్రతి పాట బావుంది. ఎస్ నివాస్ బాణీలు మళ్ళీ మళ్ళీ వినేలా ఉన్నాయి. అజయ్ అరసాడా నేపథ్య సంగీతం సైతం చక్కగా కుదిరింది. కామెడీ సీన్లకు ఆర్ఆర్ భలే చేశారు. రెహాన్ షైక్ సినిమాటోగ్రఫీ, శరత్ చంద్ర నాయుడు నిర్మాణ విలువలకు పేరు పెట్టడానికి లేదు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. హీరోలు అందరినీ టచ్ చేశారు. ఖుషి పాటల పుస్తకం నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా సీన్స్ తీశారు. అప్పటి సూపర్ హిట్ పాటలను నేపథ్యంలో వినిపించారు.
సంతోష్ పాత్రలో విరాజ్ అశ్విన్‌ను చూశాక... మరొకర్ని ఊహించుకోలేం. అంత చక్కగా నటించారు. హ్యాండ్సమ్ లుక్స్ ఒక్కటే కాదు... క్యారెక్టర్‌కు అవసరమైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. గజినీలా మారిన తర్వాత చెప్పిందే మళ్ళీ చెప్పి, చేసిందే మళ్ళీ చేసే సన్నివేశాల్లో విరాజ్ అశ్విన్ ఇన్నోసెన్స్, యాక్టింగ్ బావున్నాయి. వైవా రాఘవ, గోదావరి గోపీ, సిద్ధూ పవన్... స్నేహితులుగా నటించిన ముగ్గురూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముగ్గురిలో వైవా రాఘవకు కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. కథకు కీలకమైన సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగా పలికించారు. తనలో కమెడియన్ మాత్రమే కాదు... సీరియస్ యాక్టర్ కూడా ఉన్నాడని నిరూపించుకునే అవకాశం అతనికి దక్కింది.
వైశాలి పాత్రలో యశశ్రీ లుక్స్ ఓకే. కానీ, నటనలో ఇంప్రూవ్ అవ్వాలి. ఎమోషనల్ సీన్స్‌లో పరిణితి చెందాలి. కొన్ని సన్నివేశాల్లో లిప్ సింక్ కూడా సరిగా లేదు. కానీ యశశ్రీ తండ్రిగా నటించిన ప్రియదర్శిని రామ్ (Priyadarshini Ram)ను అస్సలు మర్చిపోలేం. ఆయన నటన మాత్రమే కాదు... గొంతులోని గాంభీర్యం కూడా సిరీస్ చూశాక గుర్తుంటుంది. స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎంత స్ట్రిక్ట్‌గా కనిపించారో... తండ్రిగా కుమార్తె భవిష్యత్తు గురించి ఆలోచించే సన్నివేశాల్లో అంతే ఆలోచన చూపించారు. శివన్నారాయణ, గోపరాజు రమణతో ప్రియదర్శిని రామ్ కాంబినేషన్ సీన్స్ భలే నవ్విస్తాయి. హీరో తాతయ్య, అమ్మమ్మ పాత్రల్లో శుభలేఖ సుధాకర్, రోహాణి హట్టంగడి తమ అనుభవాన్ని చూపించారు. బాల నటులు, మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. సిరీస్‌కు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ కుదిరింది.
గుర్తుకొస్తున్నాయి... ఇదో నవ్వుల నోస్టాల్జియా. సిరీస్‌లో ఉన్నది సింపుల్ కథే. కానీ, ఆడియన్స్ హార్టును టచ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. నవ్వులు లోటు లేదు. ఫస్ట్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు నవ్విస్తూ... తర్వాత ఏం జరుగుతుందోనని చిన్నపాటి క్యూరియాసిటీ కలిగిస్తూ ఉంటుంది. సినిమాకు తగ్గని ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















