అన్వేషించండి

TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!

TRS Chief Kavitha: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రక్షణ సేనకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చేలా ఉంది. దీనిపై వస్తున్న అభ్యంతరాలపై స్పందించిన ఈసీఐ, కవితకు లేఖ రాసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది.
  • పదిహేను రోజుల్లో ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ రద్దు.
  • ఈ పరిణామం కవితకు తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించింది.

TRS Chief Kavitha: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ను ఎదురించి తెలంగాణ రక్షణ సేనతో ప్రజల ముందుకు వచ్చిన కవితకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. తెలంగాణ రక్షణ సేన ఏర్పాటుపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. అయితే దీనిపై వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిశీలించిన కేంద్రం ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. ప్రత్యమ్నాయ పేర్లు మరోసారి ఇవ్వాలని పేర్కొంది. లేకుంటే పదిహేను రోజుల్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో కవిత వర్గం డైలమాలో పడింది.  

తెలుగు రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ది కీలకమైన పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపించిన ఈ పార్టీ ప్రజలకు సెంటిమెంట్‌గా మారింది. ఇదే పేరుతో ఉద్యమాన్ని నడిపించి, రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ తర్వాత తన దృష్టిని జాతీయ రాజకీయాలపై పెట్టారు. దీంతో ప్రజలకు చాలా దగ్గరైన టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారు. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ భారత్‌ రాష్ట్ర సమితిగా రూపొంతర చెందింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసింది. కానీ ఆ పేరు కలిసి వచ్చేలా కొత్త కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. 

కేసీఆర్ కుమార్తె కవిత కూడా టీఆర్‌ఎస్‌ అనే సంక్షిప్త రూపం వచ్చేలా తెలంగాణ రక్షణ సేన పేరుతో  పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ పేరు ప్రకటన రోజు దీన్ని తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్‌గానే చూపించారు. తర్వాత 24 గంటలకే పేరును తెలంగాణ రక్షణ సేనగా మర్చారు. పార్టీ పేరు ఏదైనా చివరకు టీఆర్‌ఎస్ అనే సంక్షిప్త రూపం వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ప్రజల్లో ఆ పేరుకు ఉన్న ఎమోషన్ తనకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమె దీని కోసం పట్టుబట్టారు. 

అయితే ఇప్పుడు ఆపేరు ఆమెకు దక్కేలా కనిపించడం లేదు. పేరు ప్రకటన మొదటి రోజు నుంచి కూడా బీఆర్‌ఎస్ అనుకూల వర్గాల నుంచి, కేసీఆర్ అభిమానుల వద్ద నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదులు చేశారు. పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసిన ఈసీ, అభ్యంతరాలతో వెనక్కి తగ్గేలా ఉంది. టీఆర్‌ఎస్ పేరు వచ్చేలా ఒకట్రెండు పార్టీలు ఉన్నాయని, ఇప్పుడు కవితకి కూడా అలాంటి పేరుతో వచ్చే పార్టీని రిజిస్ట్రేన్ చేస్తే గందరగోళం ఏర్పడుతుందని వారంతా ఈసీకి లేఖలు రాశారు. 

ఇలా వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. అన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వేళ కచ్చితంగా పేరు మార్చుకోవాల్సి ఉంటుందని కవితకు తెలియజేసింది. అందుకే మూడు ప్రత్యామ్నాయ పేర్లతో మరోసారి అప్లై చేయాలని సూచించింది. లేఖలకు స్పందించకపోయినా, మూడు ప్రత్యామ్నాయాలు చెప్పకపోయినా 15 రోజుల్లో పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తేల్చేసింది. ఇప్పుడు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఆసక్తిగా మారింది. వివాదాన్ని ఈసీతో తేల్చుకుంటారా లేకుంటే కోర్టును ఆశ్రయిస్తారా అనేది తేలాల్సి ఉంది. 

Frequently Asked Questions

కవిత ఏర్పాటు చేసిన పార్టీ పేరు ఏమిటి?

కవిత

ఎన్నికల సంఘం కవితను ఏ చర్యలు తీసుకోవాలని కోరింది?

ఎన్నికల సంఘం కవితను మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లతో తిరిగి దరఖాస్తు చేయమని సూచించింది. లేకపోతే, 15 రోజుల్లో పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

కవిత పార్టీ పేరులో 'టీఆర్ఎస్' అనే సంక్షిప్త రూపం ఉండటానికి కారణం ఏమిటి?

'టీఆర్ఎస్' అనే పేరు ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ తనకు కలిసి వస్తుందని కవిత భావించింది. ఈ ఉద్దేశ్యంతోనే ఆమె తన పార్టీ పేరు 'తెలంగాణ రక్షణ సేన'కు ఈ సంక్షిప్త రూపాన్ని వచ్చేలా జాగ్రత్త పడింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget