Year End 2021: 2021లో లాంచ్ అయిన సూపర్ హిట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ 2021లో మంచి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. వాటిలో ప్రధాన ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఇవే..
2021లో పెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ మనదేశంలో మంచి స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, షియోమీ.. ఇలా అన్ని బ్రాండ్లూ అదిరిపోయే ఫీచర్లతో రీజనబుల్ ధరల్లోనే స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేశాయి. ఐఫోన్ 13 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్, వన్‌ప్లస్ 9 సిరీస్ వీటిలో పాపులర్ మోడళ్లు. వీటితో పాటు మార్కెట్‌ను ప్రభావితం చేసిన ఎన్నో ఫోన్లు ఈ సంవత్సరం లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు కూడా ఎక్కువగా లాంచ్ కావడం విశేషం. ఈ సంవత్సరం ప్రముఖ బ్రాండ్లు లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ సిరీస్‌లు ఇవే..
యాపిల్ ఐఫోన్లు
కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్‌లో యాపిల్ కొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటి ధర రూ.69,900 నుంచి రూ.1,29,900 వరకు ఉంది. ఐఫోన్ మినీ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,900 కాగా, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900గా ఉంది. ఇక 512 జీబీ వేరియంట్ ధర ఏకంగా రూ.99,900గా ఉంది.
ఐఫోన్ 13లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900గా ఉంది. ఇక 512 జీబీ వేరియంట్ ధర రూ.1,09,900గా నిర్ణయించారు. ఐఫోన్ 13 ప్రో సిరీస్ ధర రూ.1,19,900 నుంచి రూ.1,69,900 వరకు ఉంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ.1,29,900 నుంచి రూ.1,79,900 వరకు నిర్ణయించారు.
శాంసంగ్
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరం లాంచ్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌లో 7.6 అంగుళాల ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను అందించారు. ఇది స్టైలస్ పెన్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
వన్‌ప్లస్
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ఆర్, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్ ఫోన్లు కంపెనీ ఈ సంవత్సరం లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 9లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది.
ఇక వన్‌ప్లస్ ప్రోలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999గా నిర్ణయించారు. ఈ సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999గా ఉంది.
వివో
వివో కూడా ఎక్స్70 ప్రో, ఎక్స్70 ప్రో ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను లాంచ్ చేసింది. వివో ఎక్స్70 ప్రో ధర రూ.46,990 నుంచి ప్రారంభం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,990గా ఉంది. ఇక వివో ఎక్స్70 ప్రో ప్లస్ ధర రూ.79,900గా ఉంది.
రియల్‌మీ
రియల్‌మీ కూడా తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ జీటీ నియో 2 లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉన్నాయి.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?