అన్వేషించండి

Xiaomi Smartphone Shipments: క్యూ 2 అమ్మకాల్లో దూసుకుపోయిన షియోమీ..

భారతదేశంలో 2021 రెండో త్రైమాసికానికి సంబంధించి స్మార్ట్ ఫోన్ అమ్మకాల నివేదికను కౌంటర్ పాయింట్ సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం 28.4 శాతం అమ్మకాలతో షియోమీ టాప్ ప్లేస్‌లో నిలిచింది.

భారతదేశంలో 2021 రెండో త్రైమాసికానికి సంబంధించి (క్యూ 2) స్మార్ట్ ఫోన్ విక్రయాల నివేదికను కౌంటర్ పాయింట్ సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం.. 2021 క్వార్టర్ 2లో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 82 శాతం వృద్ధితో 33 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో అధికంగా అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ పేర్కొంది.

మొత్తం మార్కెట్లో 28.4 శాతం అమ్మకాలతో షియోమీ (Xiaomi) టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఒకే త్రైమాసికంలో అత్యధిక సగటు అమ్మకపు ధరను (ఏఎస్పీ) షియోమీ సాధించిందని నివేదికలో తెలిపింది. ఈ విజయంలో రెడ్‌మీ (Redmi) సిరీస్ ఫోన్ల పాత్ర చాలా ఉందని అభిప్రాయపడింది. ఇక 18 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాలతో శాంసంగ్ రెండో స్థానంలో నిలిచింది. 15 శాతం షేర్లతో వివో మూడో స్థానంలో ఉండగా.. రియల్ మీ (14.6 శాతం), ఒప్పో (10.4 శాతం) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

రెడ్‌మీ, పోకో, షియోమీ ఫోన్ల అమ్మకాలన్నీ షియోమీ కిందకే వస్తాయి. ఎంఐ 11 సిరీస్, రెడ్‌మీ 9 (రూ.8,999) సిరీస్, రెడ్‌మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయని తెలిపింది. ఇక శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం సిరీస్, ఎఫ్ సిరీస్ అత్యధికంగా అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది.

ప్రీమియంలో వన్ ప్లస్ టాప్..
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల (రూ.30 వేలకు పైగా ధర ఉన్నవి) అమ్మకాల్లో వన్ ప్లస్ 34 శాతం షేర్‌తో మొదటి స్థానంలో ఉందని కౌంటర్ పాయింట్ తెలిపింది. కోవిడ్19 ప్రభావం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై కూడా పడిందని వెల్లడించింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఫోన్లను అమ్మే కంపెనీలు అధికంగా నష్టపోయాయని పేర్కొంది. షియోమీ, రియల్‌మీ వంటి కంపెనీలు తమ ఫోన్లను ఆన్ లైన్ విధానంలో అమ్మకాలు జరిపాయని చెప్పింది. 

79 శాతం మార్కెట్ చైనా బ్రాండ్స్‌దే..
మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 79 శాతం షేర్లను చైనా బ్రాండ్స్ సొంతం చేసుకున్నాయని వివరించింది. టాప్ 5 స్థానాల్లో నిలిచిన ఫోన్లలో షియోమీ కంపెనీవి నాలుగు మోడల్స్ ఉన్నాయి. రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9 పవర్, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ 9 మోడల్స్ టాప్ 5లో నిలిచాయి. వీటిలో మూడు మోడల్స్‌కు మిలియన్ పైగా అమ్మకాలు జరిగాయని నివేదికలో తెలిపింది. గత మూడు త్రైమాసికాలతో పోలిస్తే రెడ్‌మీ 9 ఏ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిందని పేర్కొంది. 

శాంసంగ్ ఫోన్లలో గెలాక్సీ ఎం సిరీస్, ఎఫ్ సిరీస్ ఫోన్లు 66 శాతం అమ్మకాలను సాధించాయి. రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య ధర ఉన్న ఫోన్లలో (అప్పర్ మిడ్ టైర్) శాంసంగ్ గెలాక్సీ ఏ 32, గెలాక్సీ ఏ52, గెలాక్సీ ఎఫ్62 అమ్మకాల్లో దూసుకుపోయాయని తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Embed widget