అన్వేషించండి

Xiaomi 12 Series: ఒకే ఫోన్‌లో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు.. షియోమీ 12 సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన 12 సిరీస్ ఫోన్లు చైనాలో లాంచ్ చేసింది.

షియోమీ 12, షియోమీ 12 ప్రో, షియోమీ 12ఎక్స్ స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. దీంతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఐవోఎస్ 15 తరహా ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో విడ్జెట్ సపోర్ట్‌ను కూడా అందించారు.

షియోమీ 12, షియోమీ 12 ప్రో, షియోమీ 12ఎక్స్ ధర
షియోమీ 12లో మూడు వేరియంట్లు అందించారు. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా(సుమారు రూ.43,400) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.46,900), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లుగానూ (సుమారు రూ.51,600) నిర్ణయించారు.

షియోమీ 12 ప్రోలో కూడా మూడు వేరియంట్లే ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,699 యువాన్లుగా(సుమారు రూ.55,100) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.58,600), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,399 యువాన్లుగానూ (సుమారు రూ.63,300) నిర్ణయించారు.

షియోమీ 12 ఎక్స్‌లో కూడా మూడు వేరియంట్లనే కంపెనీ లాంచ్ చేసింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,199 యువాన్లుగా(సుమారు రూ.37,500) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లుగానూ (సుమారు రూ.41,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లుగానూ (సుమారు రూ.44,500) నిర్ణయించారు.

చైనాలో వీటి సేల్ డిసెంబర్ 31వ తేదీ నుంచి జరగనుంది. మనదేశంలో కూడా ఇవి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

షియోమీ 12 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో హెచ్‌డీఆర్, ఏఐ ఫీచర్లు కూడా అందించారు.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 67W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. దీని మందం 0.81 సెంటీమీటర్లుగానూ, బరువు 180 గ్రాములుగానూ ఉంది.

షియోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు
ఇది కూడా ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.73 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు.

ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇక మిగతా కనెక్టివిటీ ఫీచర్లన్నీ షియోమీ 12 ప్రో తరహాలో ఉంది. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.

షియోమీ 12ఎక్స్ స్పెసిఫికేషన్లు
దీని ఫీచర్లన్నీ షియోమీ 12 తరహాలోనే ఉన్నాయి. షియోమీ 12లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1ను అందించగా.. ఇందులో మాత్రం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. ఈ రెండు ఫోన్ల మధ్య ఇదొక్కటే తేడా.

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Xiaomi 12 Series: ఒకే ఫోన్‌లో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు.. షియోమీ 12 సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. 19న తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. 19న తీరం దాటే అవకాశం
Nara Lokesh: అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
Tammareddy Bharadwaja: సినీ కార్మికుల వల్ల నిర్మాత నష్టపోతున్నారా? - ఫిల్మ్ ఫెడరేషన్ లేకుండా సినిమా తీయలేరా?... ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ
సినీ కార్మికుల వల్ల నిర్మాత నష్టపోతున్నారా? - ఫిల్మ్ ఫెడరేషన్ లేకుండా సినిమా తీయలేరా?... ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ
Advertisement

వీడియోలు

Pakistan Man Illegal Affair in Hyderabad | హైదరాబాద్ లో లవ్ జిహాద్ కేసు | ABP Desam
Why not Pulivendula Slogan Win | కుప్పంను కొడదామనుకున్నారు..పులివెందులే పోయింది | ABP Desam
Tollywood Workers Strike | ఆ ఒక్క మెసేజ్ తో సమ్మె విరమించడానికి మేం సిద్దంగా ఉన్నాం | ABP Desam
CM Chandrababu RTC Bus Journey | స్త్రీశక్తి పథకాన్ని పంద్రాగస్టు కానుకగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు | ABP Desam
Jr NTR Hrithik Roshan War 2 Movie Video Review | వార్ 2 సినిమాకు ప్రేక్షకులు సలామ్ అంటారా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. 19న తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. 19న తీరం దాటే అవకాశం
Nara Lokesh: అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
Tammareddy Bharadwaja: సినీ కార్మికుల వల్ల నిర్మాత నష్టపోతున్నారా? - ఫిల్మ్ ఫెడరేషన్ లేకుండా సినిమా తీయలేరా?... ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ
సినీ కార్మికుల వల్ల నిర్మాత నష్టపోతున్నారా? - ఫిల్మ్ ఫెడరేషన్ లేకుండా సినిమా తీయలేరా?... ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ
Daggupati Venkateswara Prasad On War 2: ఎన్టీఆర్‌ను తిట్టలేదు... ఆ కాల్ నాది కాదు - టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రియాక్షన్
ఎన్టీఆర్‌ను తిట్టలేదు... ఆ కాల్ నాది కాదు - టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రియాక్షన్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ తుపాన్ - సూపర్ స్టార్ పోస్టుకు పవర్ స్టార్ రియాక్షన్
పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ తుపాన్ - సూపర్ స్టార్ పోస్టుకు పవర్ స్టార్ రియాక్షన్
Honda Activa 110 EMI: రూ.5 వేలకు హోండా యాక్టివా 110 తీసుకోండి.. బైక్ లోన్ EMI ఎన్నేళ్లు కట్టాలి
రూ.5 వేలకు హోండా యాక్టివా 110 తీసుకోండి.. బైక్ లోన్ EMI ఎన్నేళ్లు కట్టాలి
Puri Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీపై లేటెస్ట్ అప్డేట్ - డిఫరెంట్ స్టోరీలో రోల్ అదేనా?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీపై లేటెస్ట్ అప్డేట్ - డిఫరెంట్ స్టోరీలో రోల్ అదేనా?
Embed widget