Women's Day 2023: ఉమెన్స్ డే రోజు ఈ గ్యాడ్జెట్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి, నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకోండి!
బహుమతులంటే మహిళలకు ఎంతో ఇష్టం. అదీ తాము ఇష్టపడే వారు ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీలవుతారు. ఉమెన్స్ డే వేళ మీ ప్రియమైన మహిళల కోసం తక్కువ ఖర్చుతో ఈ టెక్ గిఫ్ట్స్ ఇవ్వండి. హ్యాపీసెన్ పంచుకోండి.
మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళలు సమాజానికి చేస్తున్న సేవను గుర్తు చేసుకుంటారు. ఆయా రంగాల్లో మహిళల విజయాలను వేడుకగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తమకు ఇష్టమైన మహిళల కోసం పలువురు చక్కటి బహుమతులు ఇస్తారు. ఆయా వ్యక్తుల స్థోమతకు తగిన విధంగా గిఫ్ట్స్ అందజేస్తారు. ప్రియమైన వారితో సంతోషాన్ని పంచుకుంటారు. మహిళలకు సౌందర్య సాధనాలతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే చాలా ఇష్టపడతారు. మహిళా దినోత్సవం వేళ తక్కువ ధరలో ఇచ్చే టెక్ గిఫ్ట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం..
టెక్ గిఫ్ట్స్ ఆన్‌లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో అనేకం ఉన్నాయి. అన్ని గాడ్జెట్‌లు ప్రతి స్త్రీకి నచ్చకపోవచ్చు. అందుకే రూ. 10 వేల లోపు అందరు మహిళలు ఇష్టపడే టెక్ గిఫ్ట్స్ లిస్టు రూపొందించాం. వాటిని ఓసారి చెక్ చేయండి. నచ్చిన గిఫ్ట్ నచ్చిన మహిళకు ఇచ్చి సంతోషపరచండి.
మహిళల కోసం రూ.10 వేల లోపు 5 బెస్ట్ టెక్ గిఫ్ట్స్ ఇవే..
1. Infinix Note 12i:
రూ.10 వేల లోపు చాలా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కానీ, లేటెస్ట్ టెక్నాలజీ కోసం చూస్తున్నట్లయితే, Infinix Note 12i సరైన ఎంపిక. ఇది 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. MediaTek Helio G85 చిప్‌సెట్, 33W టైప్-సి ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. ధర కేవలం రూ. 9,999.
2. బోట్ ఎక్స్ టెండ్ స్మార్ట్ వాచ్:
ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ గతంతో పోల్చితే మరింత సరసమైన ధరలో వస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 7,990 కాగా.. మీరు దీన్ని అమెజాన్, క్రోమా, విజయ్ సేల్స్‌లో రూ.2299 తగ్గింపు ధరతో పొందే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 1.69-అంగుళాల LCD డిస్ ప్లే, 50కి పైగా వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. ఇది హార్ట్ రేట్, SPo2, నిద్ర తీరును కూడా ట్రాక్ చేయగలదు.
3. జాబ్రా ఎలైట్ 4 యాక్టివ్:
మ్యూజిక్ ను ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. జాబ్రా 4 బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌లు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీని అందిస్తుంది. IP57 రేటింగ్‌ను కలిగి ఉంది. మీకు Jabra Elite 7 Active కంటే తక్కువ ధర కావాలంటే, Elite 4 Activeని అమెజాన్ లో కేవలం రూ. 6,999కే పొందే అవకాశం ఉంటుంది.
4. Google Pixel Buds A-Series:
Google Assistantతో వచ్చే మరో ఆడియో ఆప్షన్ Google Pixel Buds A-Series. Flipkartలో దీని ధర రూ. 7,999. ఇది 12mm డైనమిక్ డ్రైవర్లు, బ్లూ టూత్ వెర్షన్ 4, IPX4 రేటింగ్ తో వస్తుంది. ఇది పాసివ్ నాయిస్ తగ్గింపుతో లభిస్తుంది.
5. కిండ్ల్ పేపర్ వైట్
చదవడానికి ఇష్టపడే మహిళల కోసం కిండ్ల్ పేపర్ వైట్ ఇది బెస్ట్ ఆప్షన్. అమెజాన్ లో ఇది కేవలం రూ. 9,999కే లభిస్తోంది.
Read Also: వాట్సాప్ స్టిక్కర్స్, GIFలతో హోలీ విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా చేయండి