Holi Celebrations 2023: వాట్సాప్ స్టిక్కర్స్, GIFలతో హోలీ విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా చేయండి
హోలీ పండుగ వేళ మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటున్నారా? వాట్సాప్ ద్వారా చక్కటి స్టిక్కర్స్, అదిరిపోయే GIFలు పంపి విష్ చేయవచ్చు. ఎలా పంపించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర సహా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ హోలీ జరుపుకుంటున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో రేపు (బుధవారం) జరుపుకోబోతున్నారు. చెడుపై ధర్మం విజయానికి గుర్తుగా ప్రజలు ఈ వేడుక జరుపుకుంటారు. రంగులు చల్లుకుంటూ సరదాగా గడుపుతారు. రంగుల పండుగ రోజున మనకు ఇష్టమైన మిత్రులు దగ్గరలో లేనప్పుడు వాట్సాప్ ద్వారా విష్ చేసుకోవచ్చు. ఇందుకోసం చక్కటి స్టిక్కర్స్, అదిరిపోయే GIFలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మనకు నచ్చినట్లుగా తయారు చేసుకుని మిత్రులకు పంపి విష్ చేయవచ్చు. ఇంతకీ వాట్సాప్ ద్వారా హోలీ స్టిక్కర్స్, GIFలు ఎలా పంపాలో మీకు తెలుసా? ఇదిగో ఇలా చేయండి.
హ్యాపీ హోలీ వాట్సాప్ స్టిక్కర్లను ఎలా పంపాలి?
స్టెప్1: ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. మీరు విషెస్ పంపించాలి అనుకునే గ్రూప్, లేదంటే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని, చాట్ బాక్స్ ఓపెన్ చేయాలి.
స్టెప్2: చాట్ బాక్స్ లో స్మైలీ ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్3: ఆపై స్టిక్కర్ ఎంపికను ఎంచుకోవాలి.
స్టెప్4: ఇది మీకు కొన్ని ఆప్షన్స్ ను చూపిస్తుంది. అయితే, మీరు “+” చిహ్నాన్ని నొక్కడం ద్వారా మరిన్ని స్టిక్కర్స్ ను యాడ్ చేసుకోవచ్చు.
స్టెప్5: ఇది గూగుల్/ఆపిల్ స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి స్టిక్కర్స్ యాడ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది.
స్టెప్6: హ్యాపీ హోలీలో స్టిక్కర్లను ఇప్పుడు వెతికి వాట్సాప్ కు యాడ్ చేసుకోవాలి.
స్టెప్7: ఇప్పుడు, మీకు ఇష్టమైన వారికి, సహ ఉద్యోగులకు, బంధు మిత్రులకు హోలీకి సంబంధించిన స్టిక్కర్లు పంపించుకోవచ్చు. హోలీ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు.
హ్యాపీ హోలీ వాట్సాప్ GIFలు ఎలా పంపాలి?
స్టెప్1: ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. మీరు విషెష్ పంపించాలి అనుకుకున్న వ్యక్తి చాట్ సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్2: స్మైలీ ఆప్షన్ మీద టాబ్ చేయాలి. GIFS కేటలాగ్‌కు వెళ్లాలి.
స్టెప్3: అందులో GIFS ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి. వాటిని నచ్చిన వారికి పంపించుకోవాలి.
వాట్సాప్ లో హోలీ మెసేజ్ లను కూడా పంపించుకోవచ్చు.
❂ ప్రియమైన మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు! ఈ రంగురంగుల పండుగ మీ జీవితాలను ఆనందంతో నింపాలని కోరుకుంటున్నాను.
❂ హోలీ శుభ సందర్భంలో విభేదాలు మరచి.. ఐక్యత, ప్రేమను కలగలిపి వేడుక జరుపుకుందాం. రంగులతో ఒకరినొకరు ఆనందంలో ముంచుకుందాం. డోలు దరువులకు డ్యాన్స్‌లు చేద్దాం. ఆనందంగా హోలీ జరుపుకుందాం.
❂ ఈ రంగుల పండుగ మిమ్మల్ని మీ ప్రియమైనవారికి మరింత దగ్గర చేయాలని ఆకాంక్షిస్తున్నాం. జీవితకాలం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఈ రంగుల పండుగ మిగల్చాలని కోరుకుంటున్నాం.
❂ హోలీ శుభ సందర్భంలో, ప్రేమ, సంతోషాలను అందరికీ పంచుదాం. గత చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, కొత్త సంతోషాలను నింపుకుందాం. రంగుల పండుగలో కలిసి ఆనందిద్దాం.
Read Also: హోలీ రంగుల్లో మునిగితేలుతున్నారా? మీ మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్ ను సేఫ్ గా ఉంచుకోండిలా!