Holi Celebrations 2023: హోలీ రంగుల్లో మునిగితేలుతున్నారా? మీ మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్ ను సేఫ్ గా ఉంచుకోండిలా!
హోలీ రోజున అందరూ రంగులు పూసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కలర్స్ గుప్పుకుంటూ సరదాగా గడుపుతారు. ఈ నేపథ్యంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్ లాంటి వస్తువులను ఎలా సేఫ్ గా ఉంచుకోవాలో తెలుసుకుందాం..
హోలీ వచ్చిందంటే చాలు, చిన్నా, పెద్దా కలిసి ఎంజాయ్ చేస్తారు. రంగులు పూసుకుని సరదాగా గడుపుతారు. రంగు నీళ్లు చల్లుకుంటూ, డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ హ్యాపీగా గడుపుతారు. గల్లీలన్నీ తిరుగుతూ రంగుల్లో మునిగిపోతారు. నీటి జల్లుల్లో తడిసి ముద్దవుతారు. అంతా కలిసి ఆత్మీయంగా రంగుల పండుగ జరుపుకుంటారు. అలాంటి సమయంలో మన స్మార్టు ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు ప్రమాదంలో పడతాయి. నీళ్లు, రంగులు చేరడం వల్ల పాడైపోతాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లాంటి వస్తువులను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ పరికరాలను ఎలా సేఫ్ గా ఉంచుకోవాలంటే?
స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్ బర్డ్స్ కు నీళ్లు తగిలితే చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే హోలీ ఆడే సమయంలో వాటిని ఇంట్లోనే వదిలి వెళ్లడం ఉత్తమం. తప్పని పరిస్థితుల్లో తీసుకుని వెళ్లాల్సి వస్తే, ఈ చిట్కాలపు పాటిస్తే సరిపోతుంది.
వాటర్ ఫ్రూఫ్ పర్సులు ఉపయోగించండి
వానాకాలంలో ప్రజలు తమ ఫోన్లను కాపాడుకునేందుకు వాటర్ ఫ్రూఫ్ ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తారు. ఇవి బయట చాలా చౌకగా లభిస్తాయి. హోలీ సమయంలో వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టం కలగదు. ఈ పర్స్ కు జిప్ ఉండటం మూలంగా లోనికి నీళ్లు వెళ్లే అవకాశం ఉండదు.
ఫోన్ కేసులు, స్క్రీన్, కెమెరా లెన్స్ ప్రొటెక్టర్లు
మీ స్మార్ట్ ఫోన్ ను కాపాడుకునేందుకు, చౌకైన పారదర్శక TPU కేసులను వాడవచ్చు. ఫోన్ చుట్టూ చుట్టే కేసులను ఉపయోగించవచ్చు. వాటి వలన రంగులు పడినా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఫోన్ కీలకమైన భాగాలను రంగుల నుంచి రక్షించడానికి స్క్రీన్ ప్రొటెక్టర్లు, కెమెరా లెన్స్ కవర్లను కూడా ఉపయోగించవచ్చు. వాటి ద్వారా స్మార్ట్ ఫోన్లను చెడిపోకుండా కాపాడుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్లను జాగ్రత్తగా శుభ్రం చేయాలి
హోలీ వేళ ఫోన్లను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫోన్పై రంగులు పడితే, దాన్ని శుభ్రపరిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మెత్తటి వస్త్రంతో రంగులను తుడిచి వేయాలి.
డస్ట్ ప్లగ్స్ వాడండి
మీ స్మార్ట్ ఫోన్‌లో ఓపెన్ పోర్ట్ లను కప్పి ఉంచే డస్ట్ ప్లగ్‌లు నీటి నుంచి రక్షిస్తాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా, కొంత మేర కాపాడుతాయి. అయితే, పోర్ట్ పూర్తిగా ఓపెన్ గా ఉంచడం కంటే ఇది మంచిది. USB-C పోర్ట్‌ల కోసం డస్ట్ ప్లగ్‌లను ఆన్‌లైన్‌లో ఈజీగా కొనుగోలు చేయవచ్చు.
ఇయర్ బడ్‌లు, స్మార్ట్ వాచ్‌లు
హోలీ వేళ ఇయర్ బడ్స్ ను మీతో తీసుకెళ్తే ప్లాస్టిక్ కవర్ లో ఉంచడం మంచింది. వీలైనంత వరకు వీటిని నీటిలో పడకుండా చూసుకోవాలి. హోలీ వేడుకల సమయంలో ఇవి పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఇంట్లోనే ఉంచి వెళ్లడం ఉత్తమం. స్మార్ట్ వాచ్ లను హోలీ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. స్క్రీన్ ప్రొటెక్టర్లు ఉపయోగించి కాపాడుకోవాలి.
Read Also: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వెంటనే అయిపోతుందా? ఈ టిప్స్ ఉపయోగించి బ్యాటరీ లైఫ్ పెంచుకోండి!