Smartphone Battery Life Tips: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వెంటనే అయిపోతుందా? ఈ టిప్స్ ఉపయోగించి బ్యాటరీ లైఫ్ పెంచుకోండి!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే, చాలా మంది ఎదుర్కొనే సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. రకరకాల అవసరాల కోసం ఒక్కొక్కరి దగ్గర రెండు, మూడు ఫోన్లు కూడా ఉంటున్నాయి. అయితే, చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ల బ్యాటరీల ఎక్కువసేపు ఉండవు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే, బయటకు వెళ్లినప్పుడు ఛార్జింగ్ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ లైఫ్ పెంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకునే 9 చిట్కాలు:-
1.స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని తగ్గించండి
డిస్‌ప్లేలు సాధారణంగా ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవ్వడానికి ఇదో ప్రధాన కారణం. స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం వలన బ్యాటరీ వినియోగాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. మీ Android ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు.
2.స్క్రీన్ ఆఫ్ సమయాన్ని తగ్గించండి
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లు వాడే వారు స్క్రీన్ ఆఫ్ సమయాన్ని తగ్గించడం వలనం బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు. డిస్ ప్లే త్వరగా ఆఫ్ చేయడం కారణంగా బ్యాటరీ శక్తి వేస్ట్ కాకుండా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
3.బ్రైట్‌నెస్ లెవెల్ ఆటోమేటిక్‌గా సెట్ చేయండి
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు చాలా వరకు లైట్ సెన్సార్‌తో వస్తున్నాయి. ఇది పరిసర ప్రాంతాల లైటింగ్ ఆధారంగా స్క్రీన్ బ్రైట్‌నెస్ ఆటోమేటిక్ గా సర్దుబాటు చేస్తోంది. చీకటి ప్రాంతాల్లో స్క్రీన్ లైటింగ్ ను తగ్గిస్తుంది. వెలుగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెంచుతుంది. ఈ కారణంగా బ్యాటరీ లైఫ్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
4.వైబ్రేషన్స్ ఆఫ్ చేయండి
నిజానికి స్మార్ట్ ఫోన్లు రింగ్ టోన్ తో పోల్చితే వైబ్రేషన్ కే ఎక్కువ బ్యాటరీ ఎనర్జీని ఉపయోగిస్తాయి. అందుకే, వైబ్రేషన్‌లను ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ జీవితాన్ని ఆదా చేసుకోవచ్చు.
5.ఎక్కువ బ్యాటరీ వాడే యాప్ లను కట్టడి చేయాలి
బ్యాక్‌గ్రౌండ్ లో యాప్‌లు రన్ కావడం మూలంగా చాలా వరకు బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ పవర్ వినియోగించే బ్యాక్ గ్రౌండ్ సర్వీస్‌లను ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ మెరుగు పరుచుకోవచ్చు.
6.పవర్ సేవింగ్ మోడ్‌ని ఉపయోగించండి
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లు పవర్ సేవింగ్ మోడ్‌లతో వస్తాయి. బ్యాక్ గ్రౌండ్ సర్వీసులను ఆఫ్ చేయడం, బ్రైట్‌నెస్ తగ్గించడం, కొన్ని సందర్భాల్లో CPU పని తీరును తగ్గించడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు.
7.అవసరం లేని యాప్‌లను క్లోజ్ చేయండి
ఒకేసారి అనేక యాప్‌లను రన్ చేయడం వల్ల మీ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. ఎనర్జీ సేవ్ చేయడానికి మీరు ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయడం ఉత్తమం.
8.సెట్టింగ్‌లను సర్దుబాటు చేసుకోవడం
ఇమెయిల్, సోషల్ మీడియా యాప్స్ ఆటోమేటిక్ అప్ డేషన్ కారణంగా ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకే Wi-Fiకి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే యాప్స్ అప్ డేట్ అయ్యేలా సెట్ చేసుకోవడం మంచిది.
9.బ్లాక్, డార్క్ థీమ్ ఉపయోగించండి
డార్క్ మోడ్ లేదంటే బ్లాక్ థీమ్ ఉపయోగిండం ద్వారా OLED స్క్రీన్ ఉన్న ఫోన్లలో బ్యాటరీ జీవితాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవచ్చు.
Read Also: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!