అన్వేషించండి

Importance Of Update: ఫోన్‌కు అప్‌డేట్ వస్తే వదిలేస్తున్నారా? - అయితే ఇవి తెలుసుకోండి ఫస్టు!

మీ డివైసెస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది?

Gadgets Update: మనలో చాలా మంది ఉపయోగించే డివైసెస్‌ను అప్‌డేట్ చేయరు. డేటా వేస్ట్ అని, ఎందుకు అనవసరం అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఇంటర్నెట్ ఎనేబుల్డ్ పరికరాల సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ఈ అప్‌డేట్లు ఓటీఏ ద్వారా కంపెనీల నుంచి ఎప్పటికప్పుడు విడుదల అవుతాయి. ఇంటర్నెట్‌పై పని చేసే డివైసెస్ ఎప్పటికప్పుడు ఎందుకు అప్‌డేట్ అవుతాయి అనేది మీకు తెలుసా?

ఈ అప్‌డేట్స్ కారణంగా మీ డివైస్ స్మూత్‌గా రన్ అవుతుంది. మీ డివైస్ సెక్యూరిటీ మునుపటి కంటే బలంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీ డివైస్‌కు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ వచ్చినప్పుడు వెంటనే చేసేయడం మంచిది.

బగ్స్ ఫిక్స్ అవుతాయి
ఏ సాఫ్ట్‌వేర్‌లో అయినా బగ్స్ లేదా లోపాలు ఉంటూనే ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు ఎదుర్కొనే బగ్‌లు, సమస్యలను నివేదిస్తారు. డెవలపర్‌లు ఈ సమస్యలను అప్‌డేట్ల ద్వారా పరిష్కరించడానికి పని చేస్తారు. బగ్ పరిష్కారాలు సాఫ్ట్‌వేర్ స్థిరత్వం, విశ్వసనీయత, మొత్తం పనితీరును మెరుగుపరుస్తాయి.

ఇతర సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ లేదా సిస్టమ్‌లతో కంపాటబులిటీని కొనసాగించడానికి ఏదైనా పరికరానికి కొత్త అప్‌డేట్లు అవసరం కావచ్చు. కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు అప్‌డేట్‌లు తరచుగా సాఫ్ట్‌వేర్‌కు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తాయి. ఈ అప్‌డేట్లు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు కొత్త సామర్థ్యాలను అందిస్తాయి, సాఫ్ట్‌వేర్‌ను మార్కెట్లో ఉంచుతాయి.

యూజర్ల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి డెవలపర్లు వినియోగదారుల నుండి ఫీడ్‌బ్యాక్‌ను నిరంతరం సేకరిస్తూనే ఉంటారు. ఆ మార్పులను అమలు చేయడానికి అప్‌డేట్స్‌ను ఉపయోగించవచ్చు. ఇది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను మరింత స్పష్టమైన, సమర్థవంతమైన, యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుంది. కాలక్రమేణా డెవలపర్‌లు సాఫ్ట్‌వేర్ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి మార్గాలను గుర్తించగలరు.

మరోవైపు లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన లావా బ్లేజ్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఇప్పుడు ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లావా బ్లేజ్ 2 5జీలో 6.56 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, వెనకవైపు రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై లావా బ్లేజ్ 2 5జీ పని చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. లావా బ్లేజ్ 2 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

లావా బ్లేజ్ 2 5జీలో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.9,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget