వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో మరింత అందంగా కనిపించేలా!
తాజాగా వాట్సాప్ వీడియో కాల్స్‌కు మరింత ప్రాధాన్యత ఇస్తూ మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. AR(ఆగ్మెంటెడ్ రియాలిటీ) కాల్ ఎఫెక్ట్స్ ,ఫిల్టర్స్ అనే కొత్త ఫీచర్‌ను అందిస్తోంది వాట్సాప్.
ప్రపంచంలోనే అత్యధిక మంది యూజర్లతో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఎందుకంటే వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ముఖ్య భాగం అయిపోయింది. అందుకే తన స్థానాన్ని కాపాడుకోవడానికి, తమ యూజర్స్‌ను మరింత ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు చేస్తూ వస్తోంది. ఇక వాట్సప్ కాలింగ్ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేశాక కమ్యూనికేషన్ వ్యవస్థలో పెద్ద మార్పే వచ్చింది. అందుకే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌కు సంబంధించి వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తూనే ఉంది. అయితే తాజాగా వీడియో కాల్స్‌కు మరింత ప్రాధాన్యత ఇస్తూ మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది.
AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) కాల్ ఎఫెక్ట్స్ ,ఫిల్టర్స్ అనే కొత్త ఫీచర్‌ను అందిస్తోంది వాట్సాప్. వీడియో కాలింగ్‌ను మరింత మెరుగ్గా, స్పష్టంగా కనిపించేలా చేసేందుకు దీనిని అందిస్తోంది. వీడియో కాల్స్‌లో న్యూ లెవెల్ పర్సనలైజేషన్, ఇంటరాక్టివిటీ కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అలానే స్నాప్ చాట్, ఇన్‌స్టా గ్రామ్ తరహాలో మరింత ఎంగేజింగ్, ఫన్ కోసం ఇది వినియోగదారులకు సహాయ పడుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా టెస్ట్ యూజర్స్‌కు, ఐఓఎస్ యూజర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే మరింత మంది యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు WBBetaInfo రిపోర్ట్ తెలిపింది. తాజాగా వీడియో కాల్స్ (Video calls)కి మరింత ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది.
వాట్సాఫ్ ఏఆర్ కాల్ ఫీచర్స్ ఇవే - WBBetaInfo రిపోర్ట్ ప్రకారం, ఈ అప్డేట్ ఫీచర్లో కలర్ ఫిల్టర్స్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్, లోలైట్ మోడ్, టచ్ అప్ మోడ్ వంటివి ఉన్నాయి.
డైనమిక్ ఫేసియల్ ఫిల్టర్స్ - ఇది బెటర్ వీడియో కాల్ ఎక్స్పీరియన్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. వీడియో కాల్ రియల్ టైమ్‌లో యూజర్స్ ఈ ఫిల్టర్స్‌ను అవసరానికి తగ్గట్టుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్లు వీడియోలోని కలర్ టోన్‌కు ఛేంజ్ చేసుకునేందుకు అనుమతినిస్తాయి. ఇది యూజర్స్‌కు మరింత మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో ప్రీ డిజైన్డ్ సెలక్ట్డ్ బ్యాక్‌గ్రౌండ్ లేదా చుట్టు పక్కల వాతావరణాన్ని బ్లర్ లేదా స్పావ్ చేయడానికి యూజ్ అవుతుంది. మొత్తంగా బెస్ట్ విజువల్ అప్పియరెన్స్‌ను అందిస్తుంది.
లో లైట్ మోడ్ - సాధారణంగా వెలుతురు ఎక్కువగా ఉంటే వీడియో కాల్లో విజువల్ బాగా కనిపిస్తుంది. వెలుతురు తక్కువగా ఉంటే స్పష్టంగా కనపడదు. అయితే ఈ లైట్ మోడ్ ఫీచర్ వల్ల వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో లైటింగ్ అడ్జెట్ చేసు కోవచ్చు. అందుకే కాల్లో మాట్లాడే వ్యక్తి, మరింత కాంతివంతంగా, స్పష్టంగా కనిపించేలా లో లైట్ మోడ్ టూల్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. కాబట్టి ఈ ఫీచర్ మోడ్‌ను ఆన్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ వీడియోను మరింత స్పష్టంగా కనిపించేలా లైటింగ్ క్వాలిటీనీ పెంచుకోవచ్చు. లిమిటెడ్ నేచురల్ లైట్ ఉన్న పరిసరాలలో కూడా స్పష్టమైన కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం పూట వీడియో కాల్స్ మాట్లాడేవారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
టచ్ అప్ మోడ్ - ఈ నయా ఫీచర్లో టచ్ అప్ మోడ్ అనేది కూడా ఇచ్చింది వాట్సాప్. దీని ద్వారా వీడియో కాల్లో ఫేస్, స్కిన్ ఎంతో స్మూత్‌గా, అందంగా కనపడేలా చేస్తుంది. ప్రొఫెషనల్ మీటింగ్స్, క్యాజువల్ కన్వర్జేషన్స్ .. ఇలా రెండింటికి సూటబుల్ అయ్యేలా దీనికి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా స్పెషల్ లైటింగ్ వంటివి లేకుండానే విజువల్స్‌ను మెరుగ్గా చూపిస్తుంది.
అలానే యూజర్ తనకు కావాల్సిన విధంగా ఈ ఫీచర్స్‌ను ఒక్కసారి సెట్ చేసుకుంటే, అవి అలానే కంటిన్యూ అయ్యేలా వెసులుబాటును కల్పిస్తోంది వాట్సాప్. ప్రతి కాల్‌కు మళ్లీ మళ్లీ మార్చుకునేలా కాకుండా, ఒక్కసారి కావాల్సిన విధంగా ఫీచర్స్‌ను ఎనేబుల్ చేసుకుంటే, ఆటోమెటిక్‌గా అవి ప్రతీ కాల్‌కు అప్లై అయిపోతాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?