By: ABP Desam | Updated at : 24 Apr 2023 08:40 PM (IST)
వాట్సాప్ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది. ( Image Source : Pixabay )
WhatsApp New Feature: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్ పేరు ‘ఛానెల్స్’ అని తెలుస్తోంది. దీని ద్వారా వినియోగదారులు న్యూస్ అప్‌డేట్స్‌ను వేగంగా తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు వినియోగదారులు వార్తలను తెలుసుకోవడానికి కూడా వాట్సాప్ నుంచి బయటకు వెళ్లవలసిన అవసరం లేదన్న మాట. బహుశా వాట్సాప్ దాని ప్లాట్‌ఫారమ్‌ను వినియోగదారుల కోసం ఒక పూర్తి స్థాయి ఆల్ ఇన్ వన్ యాప్‌గా మార్చాలనుకుంటోంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం కొత్త ఫీచర్‌ను ఐవోఎస్‌లో పరీక్షించబడుతోంది.
ఐఫోన్ వినియోగదారుల కోసం ‘ఛానెల్స్’ ఫీచర్
వాట్సాప్‌కు సంబంధించిన ఫీచర్లను ఎప్పటికప్పుడు అందించే WaBetaInfo నివేదిక ప్రకారం వాట్సాప్ భవిష్యత్ అప్‌డేట్‌లతో కొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేయవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించి చాలా కాలం క్రితం లీకులు వెలువడ్డాయి. అయితే ఇంతకుముందు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ పరికరాలకు కూడా వస్తుందని పుకారు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఐవోఎస్‌లో టెస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం ‘ఛానెల్స్’ అనే ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది.
టెలిగ్రామ్ తరహా ఫీచర్
వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌కు, టెలిగ్రామ్ ఛానెల్ ఫీచర్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇంతకుముందు టెలిగ్రామ్ నుంచి యానిమేటెడ్ ఎమోజి ఫీచర్‌ను కూడా వాట్సాప్ కాపీ చేసింది. WaBetaInfo నివేదించిన ప్రకారం వినియోగదారులు వారు ఏ ఛానెల్‌లకు సభ్యత్వాన్ని పొందాలనుకుంటున్నారు అనే దానిపై నియంత్రణను కలిగి ఉంటారని తెలుస్తోంది. అంటే ఛానెల్స్‌లో జాయిన్ అయినా వారి ఫోన్ నంబర్లు కనిపించవన్న మాట.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ ఈ ఫీచర్‌పై చాలా కాలంగా పని చేస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఈ ఫీచర్ భవిష్యత్ అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటి వరకు అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుందని తెలుస్తోంది. ఇది ప్రైవసీని కాపాడుకోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. గత సంవత్సరం WhatsApp ఫోటోలు, వీడియోల కోసం ‘View Once’ ఫీచర్‌ను తీసుకువచ్చింది.
దీని కింద, మీరు పంపిన ఏదైనా ఫోటో లేదా వీడియోను ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఇప్పుడు ఆడియో విషయంలో కూడా అలాంటిదే చేయబోతుంది వాట్సాప్. Wabetainfo వెబ్ సైట్ కథనం ప్రకారం కంపెనీ ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని కింద వ్యక్తులు ఆడియోను కూడా ‘View Once’గా పంపగలరు. అంటే ఇప్పటి వరకు ఒక్కసారి ఫోటో, వీడియోలకు అందుబాటులో ఉన్న ఫీచర్ ఆడియోలో కూడా రానుంది.
ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా ఆడియో ‘View Once’ ద్వారా పంపిస్తే మీరు ఈ ఆడియోను సేవ్ చేయలేరు, ఫార్వర్డ్ చేయలేరు, ఆ ఆడియోను రికార్డ్ చేయలేరు. ఈ ఫీచర్ ప్రైవసీని కాపాడుకోవడంలో వ్యక్తులకు మరింత సహాయం చేస్తుంది.
ఈ రోజుల్లో ప్రజలు వాట్సాప్‌లో వచ్చే ఆడియోలను రికార్డ్ చేసి, వాటిని అనేక విధాలుగా మానిపులేట్ చేయడాన్ని మీరు చూస్తూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ ఫీచర్ సహాయంతో మీరు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు.
WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్
Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!
BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!
WhatsApp Feature: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!
BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం