అన్వేషించండి

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!

వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.

వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని చూపించే ట్యాబ్ రానుందని తెలుస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌ల ద్వారా WhatsApp నుంచి కొత్త కాల్స్ ట్యాబ్ యాప్ సైడ్‌బార్‌లో కనిపించింది. వాట్సాప్ డెస్క్‌టాప్ సైడ్‌బార్‌లో ఉన్న కాల్స్ ట్యాబ్ ప్రస్తుతం Microsoft స్టోర్ నుంచి యాప్ తాజా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవల ఆండ్రాయిడ్, iOS వినియోగదారులపై ఉన్న వినియోగదారులకు వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే టిప్‌స్టర్ షేర్ చేసిన కాల్స్ ట్యాబ్‌లో లేటెస్ట్ కాల్స్‌ను చూపించడం లేదు.వాట్సాప్ ఇంకా ఈ ఫీచర్‌ను ప్రకటించలేదు. WhatsApp ఇటీవల యాప్‌లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది. WhatsApp పోల్స్ గత వారం Android, iOS రెండింటిలోనూ ప్రారంభించారు.

వాట్సాప్‌లో ఇటీవలే మరో సరికొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ‘ఎల్లో పేజెస్’ తరహా ఫీచర్. ఇది వాట్సాప్‌లో బిజినెస్‌లను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. WhatsApp ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్. బ్రెజిల్‌తో మొట్టమొదటగా "డైరెక్టరీ" ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు WhatsApp శుక్రవారం తెలిపింది, దీని ద్వారా వినియోగదారులు సమీపంలోని స్థానిక చిన్న వ్యాపారాలను బ్రౌజ్ చేయవచ్చు, కనుగొనవచ్చు. డైరెక్టరీని మొదట సావో పాలోలో WhatsApp పరీక్షించింది. పూర్తిగా విజయవంతమైన తర్వాత దీన్ని బ్రెజిల్‌లో విడుదల చేయబోతున్నారు.

"నవంబర్ 17వ తేదీన బ్రెజిల్‌లో జరిగిన మొట్టమొదటి వాట్సాప్ బిజినెస్ సమ్మిట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేశారు. ఈ కొత్త ఫీచర్‌లు వినియోగదారులకు మెరుగైన ఎండ్-టు-ఎండ్ కామర్స్ అనుభవం అందించడానికి రూపొందించారు. వినియోగదారులను వారికి ఇష్టమైన బ్రాండ్‌లతో కనెక్ట్ చేస్తుంది." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

WhatsApp బిజినెస్ సెర్చ్‌ను కూడా ప్రకటించింది, దీని ద్వారా వినియోగదారులు దాని API ద్వారా పెద్ద బ్రాండ్‌లను కనుగొనగలరు. ఇది బ్రెజిల్, యూకే, ఇండోనేషియా, మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అందుబాటులో ఉంది.

"వ్యక్తులు చాట్ చేయాలనుకుంటున్న బిజినెస్‌ను కనుగొన్న తర్వాత, ఉత్పత్తికి సంబంధించి వారికి ఉన్న ప్రశ్నలను అడగవచ్చు. వారి వస్తువులు, సేవల కేటలాగ్‌ను బ్రౌజ్ చేయవచ్చు. కార్ట్‌లో వస్తువులను యాడ్ చేయవచ్చు. తద్వారా వారు ఏమి కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ నిర్వాహకులకు తెలుస్తుంది." అని కంపెనీ తెలిపింది.

View this post on Instagram
 
A post shared by WhatsApp (@whatsapp)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Mental Health : మానసిక ఆరోగ్యంపై 2025లో ఇండియాలో వచ్చిన మార్పులు, సవాళ్లు ఇవే
మానసిక ఆరోగ్యంపై 2025లో ఇండియాలో వచ్చిన మార్పులు, సవాళ్లు ఇవే
Andhra Pradesh Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం - ఇవిగో టాప్ టెన్ మైలురాళ్లు
ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం - ఇవిగో టాప్ టెన్ మైలురాళ్లు
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Embed widget