WhatsApp Ban: ఇండియాలో లక్షలాది వాట్సాప్ అకౌంట్లపై బ్యాన్, ఎందుకో తెలుసా?
నిబంధనలు పాటించని ఖాతాదారుపై వాట్సాప్ సీరియస్ యాక్షన్ తీసుకున్నది. జూలై నెలలో ఏకంగా 2.3 మిలియన్ల అకౌంట్లను బ్యాన్ చేసింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిబంధనలు పాటించని ఖతాదారుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నది. గైడ్ లైన్స్ ను అతిక్రమించే వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు తీరు మారకపోతే వేటు వేస్తుంది. ఈ ఏడాది జూలైలో ఏకంగా 2.3 మిలియన్ల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. తాజా యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆన్‌లైన్ మోసాలను నిరోధించడంతో పాటు సురక్షితమైన మేసేజింగ్ ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఎలా బ్యాన్ చేసిందంటే?
ఈ అకౌంట్ల బ్యాన్ విషయంలో పక్క సమచారంతోనే యాక్షన్ తీసుకున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వినియోగదారుల ఫిర్యాదులు, ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి అందుకున్న మెయిల్స్ తో పాటు వాట్సాప్ వేదికగా జరుగుతున్న ప్రమాదకరమైన ప్రవర్తనను గుర్తించి, స్వంత ఆటోమేటెడ్ టూల్స్ సహకారంతో ఈ అకౌంటులను నిషేధించినట్లు ప్రకటించింది. వినియోగదారులు, ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ ద్వారా మొత్తంగా 316 అప్పీళ్లు రాగా వీటిలో 73 అకౌంట్లు నిషేధించినట్లు తెలిపింది. మిగతావి గైడ్ లైన్స్ బ్రేక్ చేసిన కారణంగా తొలగించినట్లు ప్రకటించింది.
ఐటి రూల్స్ ప్రకారం అకౌంట్ల నిషేధం
కొత్తగా ప్రకటించిన ఐటి రూల్స్‌కు అనుగుణంగా వాట్సాప్ తన తాజా యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. జూన్ 16 నుంచి జూలై 31 మధ్య 46 రోజుల వ్యవధిలో ఫిర్యాదులు, దుర్వినియోగ నివారణ టూల్స్ ఆధారంగా వాట్సాప్ తీసుకున్న చర్యలను ఇందులో వెల్లడించింది. ఈ సమయంలో మొత్తంగా 2.3 మిలియన్ల అకౌంట్లను నిషేధించినట్లు ప్రకటించింది.
భారతీయ వినియోగదారుల ఫిర్యాదులు
జూలై నెల రోజుల వ్యవధిలో భారతీయ వినియోగదారుల నుంచి మొత్తం 594 ఫిర్యాదులు వాట్సాప్‌కు అందాయి. వాటిలో 316 నిషేధ అప్పీళ్లుగా ఉన్నాయి. ఇంకా ఈ ఫిర్యాదులలో 137 అకౌంట్ సపోర్టుకు సంబంధించినవి. మిగిలినవి భద్రతకు సంబంధించినవిగా వాట్సాప్ ప్రకటించింది.
ఆటోమేటెడ్ టూల్స్ తో నిషేధిత అకౌంట్ల గుర్తింపు
వాట్సాప్ తన సొంత ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించి దుర్వినియోగాన్ని గుర్తిస్తోంది. అకౌంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్, మెసేజింగ్ సమయం, యూజర్ రిపోర్టులు, బ్లాక్‌ల రూపంలో అందుకునే నెగటివ్ ఫీడ్ బ్యాక్ లాంటి విషయాల్లో ఈ టూల్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. ఎడ్జ్ కేసులను విశ్లేషించడానికి, కాలక్రమేణా ప్రభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి నిపుణుల బృందం ఈ వ్యవస్థలను పెంచుతున్నట్లు వాట్సాప్ మెసేజ్ ఫ్లాట్ ఫామ్ వెల్లడించింది. వాట్సప్‌లో ఏదైనా ఫిర్యాదును నివేదించడానికి వినియోగదారులు wa@support.whatsapp.com కి ఇమెయిల్ చేయవచ్చు. లేదంటే యాప్‌లో అందుబాటులో ఉన్న బటన్‌లను ఉపయోగించి అనుమానాస్పద అకౌంట్లను రిపోర్ట్ చేయడంతో పాటు బ్లాక్ చేసే అవకాశం ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!