Vivo Y33s 5G: రూ.15 వేలలోనే వివో కొత్త 5జీ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన చవకైన 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వివో వై33ఎస్ 5జీ.
Vivo Y33s 5G: వివో వై33ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. గతంలో లాంచ్ అయిన వివో వై33ఎస్ 4జీ స్మార్ట్ ఫోన్‌కు 5జీ వేరియంట్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో ఎల్సీడీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
వివో వై33ఎస్ 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను 1,299 యువాన్లుగా (సుమారు రూ.15,500) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా (సుమారు రూ.16,500), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,599 యువాన్లుగా (సుమారు రూ.19,100) ఉంది. బ్లాక్, నెబ్యులా బ్లూ, స్నో డాన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వై33ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, జీపీఎస్, వైఫై, బ్లూటూత్ వీ5.1, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
View this post on Instagram