News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vivo V23e: 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.. అదిరిపోయే ఫోన్ లాంచ్ చేసిన వివో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ వివో వీ23ఈని లాంచ్ చేసింది.

FOLLOW US: 
Share:

వివో వీ23ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. గతంలో లాంచ్ వివో వీ21ఈకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించడం విశేషం.

వివో వీ23ఈ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను 84,90,000 వియత్నాం డాంగ్‌లుగా(సుమారు రూ.27,800) నిర్ణయించారు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. బ్లాక్, బ్లూ రోజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

వివో వీ23ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో అందుబాటులో ఉన్న ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 2.0 టెక్నాలజీ ద్వారా ర్యామ్‌ను కూడా 4 జీబీ వరకు పెంచుకోవచ్చు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4050 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు.

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.74 సెంటీమీటర్లుగానూ, మందం 172 గ్రాములుగానూ ఉంది.

Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Nov 2021 11:07 PM (IST) Tags: Vivo V23e Vivo V23e Price Vivo V23e Specifications Vivo V23e Features Vivo New Phone Vivo

ఇవి కూడా చూడండి

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!

Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!