![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vivo T1 5G: వివో టీ1 5జీ వచ్చేస్తుంది.. ఆ ఫోన్లు ఇక కనిపించవు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మనదేశంలో తన టీ1 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
![Vivo T1 5G: వివో టీ1 5జీ వచ్చేస్తుంది.. ఆ ఫోన్లు ఇక కనిపించవు! Vivo T1 5G May Launch in March Know Specifications Details Vivo T1 5G: వివో టీ1 5జీ వచ్చేస్తుంది.. ఆ ఫోన్లు ఇక కనిపించవు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/17/fc4f219df8e567e9f0d3ece1a9c3ed67_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వివో టీ1 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని స్టోరేజ్ వేరియంట్ల వివరాలు తెలియరాలేదు. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రెండు నెలల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుందని తెలుస్తోంది. 12 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉండనుందని తెలుస్తోంది. వివో వై-సిరీస్ స్థానంలో టీ-సిరీస్ ఫోన్లు రానున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలుపుతున్న దాని ప్రకారం.. ఈ ఫోన్ మనదేశంలో మార్చిలో లాంచ్ కానుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. ఇందులో 12 జీబీ ర్యామ్ వేరియంట్ ఉండే అవకాశం ఉందని ముకుల్ తెలిపారు.
వివో టీ1 స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో అక్టోబర్‌లోనే లాంచ్ అయింది. భారతదేశ వేరియంట్‌లో చైనా వేరియంట్ స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. చైనా వేరియంట్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించనున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా... 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లుగా ఉండగా.. బరువు 192 గ్రాములుగా ఉంది.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)