అన్వేషించండి

Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!

Upcoming Smartphones in December 2023: 2023 డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్‌మీ 13సీ నుంచి రియల్‌మీ జీటీ5 ప్రో వరకు.

Upcoming Smartphones in December: డిసెంబర్‌తో 2023 సంవత్సరానికి మనం ముగింపు పలకనున్నాం. ఇప్పుడు సంవత్సరం చివరి నెలలో షావోమీ, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి కంపెనీలు మంచి స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయనున్నాయి. కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఇవి మంచి ఆప్షన్లు. డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

రెడ్‌మీ 13సీ (Redmi 13C)
రూ.10 వేల బడ్జెట్‌ను టార్గెట్ చేసి రెడ్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే రెడ్‌మీ 13సీ. ఈ సంవత్సరం లాంచ్ అయిన పాపులర్ రెడ్‌మీ 12సీకి తర్వాతి వెర్షన్‌గా రెడ్‌మీ 13సీ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే నైజీరియాలో లాంచ్ అయింది. డిసెంబర్ 6వ తేదీన రెడ్‌మీ 13సీని మనదేశంలో లాంచ్ చేయనున్నారు. ఇది 5జీని కూడా సపోర్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన అమెజాన్ పేజీ ఇప్పటికే లిస్ట్ అయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు.

ఐకూ 12 (iQoo 12)
ఐకూ 12 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 12వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. ఇది కూడా ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. దీని ధర రూ.60 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 12 5జీ (OnePlus 12 5G)
ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 5వ తేదీన చైనాలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌కు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జనవరి 23వ తేదీన మనదేశంలో లాంచ్ అవుతాయని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అంతకంటే ముందే వచ్చే అవకాశం కూడా ఉంది. క్వాల్‌కాం లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది.

రియల్‌మీ జీటీ5 ప్రో (Realme GT5 Pro)
డిసెంబర్ 7వ తేదీన ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. రియల్‌మీ భారతదేశంలో కూడా టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. కాబట్టి త్వరలో మనదేశంలో కూడా ఎంట్రీ ఇస్తుంది. 24 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయని సమాచారం. దీని ధర మనదేశంలో రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య నిర్ణయించనున్నారని తెలుస్తోంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో సిరీస్ (Redmi Note 13 Pro Series)
రెడ్‌మీ నోట్ 13 ప్రో సిరీస్‌పై కూడా మనదేశంలో భారీ అంచనాలు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ సిరీస్ మనదేశంలో సూపర్ హిట్. ఇవి ఇండియాలో కూడా డిసెంబర్‌లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. వీటి ధర రూ.30 వేలలోపు ఉండనుందని సమాచారం. రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉంటాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget