అన్వేషించండి

ఆగస్ట్​లో కురవనున్న స్మార్ట్​ ఫోన్ల వర్షం - టాప్​ 5 బెస్ట్ ఫీచర్​ మోడల్స్​​ ఇవే!

ఆగస్ట్ లో స్మార్ట్‌ ఫోన్‌ల వర్షం కురవనుంది. ఫ్లాగ్​షిప్​ పిక్సల్​ 9, వివీ వీ40 సిరీస్​, మోటోరోలా ఎడ్జ్​ 50,  పోకో ఎమ్​ 6 ప్లస్​ సహా పలు ఫోన్లు రిలీజ్​ కు సిద్ధమవుతున్నాయి.

మొబైల్​ ఫోన్‌ ప్రియులకు ఆగస్టులో స్మార్ట్‌ ఫోన్‌ల వర్షం కురవనుంది. ఈ నెలలో ఇండియన్ మార్కెట్​లో పలు అగ్ర సంస్థలు సరి కొత్త ఫీచర్లు కలిగి ఉన్న ఫోన్లతో విడుదలకు వరుసగా క్యూ కడుతున్నాయి. వాటిలో ఫ్లాగ్​షిప్​ పిక్సల్​ 9, వివీ వీ40 సిరీస్​, మోటోరోలా ఎడ్జ్​ 50,  పోకో ఎమ్​ 6 ప్లస్​ సహా పలు ఫోన్లు రిలీజ్​ అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఆగస్టులో ఇంకా ఏయే కంపెనీ, ఏమేం మోడల్స్​  వస్తున్నాయో తెలుసుకుందాం.


Pixel 9 series
గూగుల్ పిక్సల్ 9 సిరీస్​ నాలుగు సరికొత్త స్మార్ట్​ ఫోన్లు రాబోతున్నాయి.  సాధారణంగా సెప్టెంబర్​లో ఆపిల్ ఐ ఫోన్ సిరీస్ నుంచి స్మార్ట్​ ఫోన్ల  లాంఛ్​ ఉంటుంది. వాటికి పోటీగా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్  ఫోన్ల లాంఛ్​ కార్యక్రమాన్ని ఆగస్ట్​లోనే ఏర్పాటు చేయనుంది గూగుల్. ఈ గూగుల్​ నుంచి పిక్సల్ 9, పిక్సల్​ 9 ప్రో, పిక్సల్​ 9 ప్రో ఎక్స్​ఎల్​, పిక్సల్​ 9 ప్రో ఫోల్డ్ మోడల్స్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేయనుంది.​


Vivo V40 series
వీవో కంపెనీ కూడా కెమెరాను బాగా దృష్టిలో పెట్టుకుని వీ 40 సిరీస్​ను వచ్చే నెలలో భారత మార్కెట్​లోకి తీసుకొస్తుంది. దీనికి ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేషన్​ వచ్చేసింది. ఫ్లిప్​కార్ట్​లో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ వీ40 సిరీస్ నుంచి వీ40, వీ40 మోడల్స్​ రానున్నాయి. స్లిమ్​గా,  ZEISS బ్రాండింగ్ కెమెరాతో వస్తున్నాయి. వీటి బ్యాటరీ సామర్థ్యం 5,500mAh.  


Motorola Edge 50 
మోటోరోలా కూడా తన లేటెస్ట్​ డివైస్​ లాంఛ్ గురించి కన్ఫామ్ చేసేసింది. MIL-810 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్​తో మోటోరోలా ఎడ్జ్​ 50 భారత మార్కెట్​లో రానుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉండనుంది. 6.67 ఇంచ్​ pOLED డిస్​ప్లే, 1900 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. క్లావ్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 7 జనరేషన్​ 1 చిప్​సెట్​తో ఇది నడుస్తుంది. అలానే ఇందులో కూలింగ్ సిస్టమ్​ ఛాంబర్​ కూడా ఉంది. 256 జీబీ ర్యామ్​ సపోర్ట్​తో నడుస్తుంది. ఇంకా 3 సంవత్సరాల  ఓెస్ అప్డేట్స్​, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్​ వంటివి కూడా ఉన్నాయి.


Poco M6 Plus
పొకో సంస్థ కూడా ఎమ్​ సిరీస్​ నుంచి పోకో ఎమ్​ 6 ప్లస్​ను విడుదల చేయనుంది. ఇది రీసెంట్​గా లాంఛ్ అయిన రెడ్ మీ 13 5జీ తరహాలో ఉండనుంది. 16 మిలియన్​ కలర్స్ ఉండేలా 6.79 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​, 240Hz స్మూత్ టచ్​, 120 Hz రిఫ్రెష్ రేట్​తో రానుంది. అలానే 850 నిట్స్​ పీక్ బ్రైట్​నెస్​, పంచ్ హోల్ నోచ్​, ఇంప్రెసివ్ స్క్రీన్​తో రానుంది. ఇది క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 4జనరేషన్​ 2 అడ్వాన్స్​డ్​ ఎడిషన్ చిప్​సెట్​,  2.2 GHz ఆక్టా కోర్ ప్రొసెషనర్​తో నడుస్తుంది.


Nothing Phone 2a Plus
ఈ స్మార్ట్ ఫోన్​ వచ్చే నెల కాకుండా జులై 31నే మార్కెట్​లోకి రానుంది.  మీడియా టెక్​ 7350 చిప్​సెట్​తో నడుస్తుంది. ఈ చిప్​సెట్​  3.0Ghz సపోర్ట్ చేస్తుంది. నథింగ్ ఫోన్ 2ఏతో పోలిస్తే ఇది పది శాతం స్పీడ్​గా పనిచేస్తుంది. గ్రాఫిక్స్​, ఇంటెన్సివ్ టాస్క్​ కోసం Mali-G61200 MC4 GPU ప్రొసెజర్ కలిగి ఉంది. 12GB RAMతో రానుంది. దీన్ని 20GB RAM ఎక్స్​ప్యాన్షన్​ వరకు సపోర్ట్ చేస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget