Samsung Offers: టీవీ కొంటే రూ. 1.25 లక్షల ఫోన్ ఫ్రీ - శాంసంగ్ బిగ్ టీవీ డేస్ ప్రారంభం!
ప్రస్తుతం శాంసంగ్ బిగ్ టీవీ డేస్ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Samsung TV Offer: శాంసంగ్ తన వినియోగదారుల కోసం బిగ్ టీవీ డేస్ సేల్‌ను నిర్వహిస్తుంది. ఇందులో టీవీలపై భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. శాంసంగ్ తన నియో క్యూఎల్ఈడీ 8కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ది ఫ్రేమ్, క్రిస్టల్ 4కే క్యూహెచ్‌డీ టీవీలపై ఈ ఆఫర్‌ను అందిస్తుంది. జులై 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ సేల్ సందర్బంగా 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతో పాటు బండిల్డ్ ఆఫర్స్ కూడా అందించనున్నారు. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం 8కే రిజల్యూషన్ టీవీలను శాంసంగ్, హైసెన్స్ మాత్రమే విక్రయిస్తున్నాయి. సోనీ 8కే టీవీలు మనదేశంలో ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
కొన్ని టీవీలపై రూ.1,24,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కూడా ఉచితంగా అందించనున్నారు. ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్, రూ.51,990 విలువైన శాంసంగ్ సౌండ్ బార్స్ లభించనున్నాయి. ఈజీ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
98 అంగుళాల శాంసంగ్ నియో క్యూఓఎల్ఈడీ లేదా 98 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీ మోడల్ కొనుగోలు చేస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఉచితంగా లభించనుంది. దీంతోపాటు 75 అంగుళాల కంటే ఎక్కువ సైజున్న నియో క్యూఎల్ఈడీ టీవీలు కొనుగోలు చేస్తే రూ.69,990 విలువైన ఫ్రీస్టైల్ పోర్టబుల్ ప్రొజెక్టర్ ఉచితంగా లభించనుంది. 55 అంగుళాల పైబడిన టీవీలను కొనుగోలు చేస్తే రూ.51,990 విలువైన సౌండ్ బార్ అందించనున్నారు.
85 అంగుళాల క్రిస్టల్ 4కే యూహెచ్‌డీ టీవీ, 65 అంగుళాల నియో క్యూఎల్ఈడీ, 8కే టీవీలు, 65 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ, 75 అంగుళాల ఫ్రేమ్ టీవీ కొనుగోలు చేస్తే రూ.28,990 విలువైన సౌండ్ బార్ ఉచితంగా పొందవచ్చు. అలాగే 55 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ కొనుగోలు చేస్తే రూ.15,490 విలువైన సౌండ్ బార్ ఉచితంగా లభించనుంది.
శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 15 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడేవారికి 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఈజీ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్‌తో పాటు 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులు పొందవచ్చు.
త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 లాంచ్
ఇక మరోవైపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord 3ని వచ్చే నెలలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇది ఒక మీడియం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయ్యే అవకాశం ఉంది. అయితే కంపెనీ దీని అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కానీ తన కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కంపెనీ తన తాజా నార్డ్ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ని అధికారికంగా ప్రకటించింది.
వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరమ్‌లోని ఒక టీజర్ పోస్ట్ భారతదేశం, యూరప్, ఆసియా పసిఫిక్ (APAC) దేశాల్లో వన్‌ప్లస్ నార్డ్ 3ని లాంచ్ చేయనున్నట్లు హింట్ ఇస్తుంది. అయితే కంపెనీ స్మార్ట్‌ఫోన్ పేరును ఇంకా వెల్లడించలేదు. మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం కంపెనీ దీనిని ది నెక్స్ట్ నార్డ్ అని పిలుస్తోంది. దీన్ని బట్టి జూలైలో భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ 3 లాంచ్ అవుతుందని దాదాపు కన్ఫర్మ్ చేసుకోవచ్చు.