Philips Smart TV: సూపర్ డిస్‌ప్లేలతో స్మార్ట్ టీవీలు లాంచ్ చేసిన ఫిలిప్స్ - ధర ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ కొత్త ఆండ్రాయిడ్ టీవీలను మనదేశంలో లాంచ్ చేసింది.
ఫిలిప్స్ మనదేశంలో కొత్త ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. దీని ధర మనదేశంలో రూ.99,990 నుంచి ప్రారంభం కానుంది. అవే ఫిలిప్స్ 7900 యాంబీలైట్ అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ సిరీస్. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల సైజుల్లో ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఎల్ఈడీ స్క్రీన్స్, డాల్బీ విజన్ ఫార్మాట్‌లను ఈ టీవీలు సపోర్ట్ చేయనున్నాయి.
ఫిలిప్స్ 7900 యాంబీలైట్ అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ ధర
ఈ టీవీ సిరీస్‌లో 55 అంగుళాల మోడల్ ధర రూ.99,990గా ఉంది. 65 అంగుళాల మోడల్ ధర రూ.1,49,990గానూ, 75 అంగుళాల మోడల్ ధర రూ.1,89,990గానూ నిర్ణయించారు. ఈ మూడిటి ఫీచర్లు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. అయితే స్క్రీన్ సైజులో తేడాల కారణంగానే వీటి ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంది.
ఫిలిప్స్ 7900 యాంబీలైట్ అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు
ఈ టీవీ సిరీస్‌లో యాంబీలైట్ సిస్టంను అందించారు. అంటే టీవీలో ప్లే అయ్యే కంటెంట్‌ను బట్టి అంచుల్లో కూడా రంగులు డిస్‌ప్లే అవుతూ ఉంటాయన్న మాట. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ హెచ్‌డీఆర్ కంటెంట్‌ను సపోర్ట్ చేయనుంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లకు కూడా ఈ టీవీ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంను కూడా ఈ టీవీలో అందించారు. 55 అంగుళాల మోడల్‌లో 20W స్పీకర్ సిస్టంను అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఫీచర్ల ద్వారా టీవికి ఇంటర్నెట్, సపోర్టెడ్ డివైస్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్‌వేర్‌పై ఈ టీవీద పనిచేయనుంది. అన్ని ప్రముఖ యాప్స్, స్ట్రీమింగ్ సర్వీస్‌లను దీని ద్వారా యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. అలాగే బిల్ట్ ఇన్ గూగుల్ క్రోమ్‌కాస్ట్ ఫీచర్ కూడా అందించారు.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
View this post on Instagram