X

Apple Event 2021: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ రేపే.. ఐఫోన్ల‌తో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!

టెక్ ప్రియులు సంవ‌త్స‌రం మొత్తం ఎదురుచూసే యాపిల్ ఈవెంట్ మ‌రికొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఈ ఉత్ప‌త్తుల‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.

FOLLOW US: 

ప్ర‌పంచం మొత్తంగా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ మ‌రికొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ భార‌త‌దేశ కాల‌మానం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 14వ తేదీ రాత్రి 10ః30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. యాపిల్ కొత్త ఐఫోన్ల‌తో పాటు మ‌రిన్ని ఉత్ప‌త్తుల‌ను కూడా మ‌న‌ముందుకు తీసుకురానుంది. ఈ ఈవెంట్లో యాపిల్ లాంచ్ చేయ‌నున్న ఉత్ప‌త్తులు ఇవేనంటూ నెట్టింట్లో కొన్ని వార్తలు చక్క‌ర్లు కొడుతున్నాయి. ఆ ఉత్ప‌త్తులపై ఓ లుక్కేద్దాం..

1. ఐఫోన్ 13 సిరీస్
ఐఫోన్ 13 సిరీస్ ఈ ఈవెంట్లో లాంచ్ కావ‌డం అనేది ప‌క్కా. అయితే ఎన్ని ఐఫోన్లు లాంచ్ అవుతాయ‌నేదే ప్ర‌శ్న‌. ఐఫోన్ 12 సిరీస్ త‌ర‌హాలో.. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లాంచ్ అవుతాయా లేదా ఫోన్ల సంఖ్య పెరుగుతుందా, త‌గ్గుతుందా అనే విష‌యం ఉత్కంఠ నెల‌కొంది. 

ఐఫోన్ 13 సిరీస్ లో యాపిల్ కెమెరాను మెరుగు ప‌రిచింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 13 సిరీస్ లో 120 హెర్ట్జ్ ప్రో మోష‌న్ డిస్ ప్లేను అందించ‌నున్నార‌ని లీకులు వ‌చ్చాయి. గ‌తంలో లాంచ్ చేసిన ఐప్యాడ్ ప్రోలో ఇదే త‌ర‌హా డిస్ ప్లేను అందించారు. ఐఫోన్ 12 సిరీస్ లోనే 5జీని అందించారు. కాబ‌ట్టి 13 సిరీస్ లో కూడా 5జీ క‌చ్చితంగా ఉంటుంది.

2. యాపిల్ వాచ్ 7 సిరీస్
ఈ ఈవెంట్లో యాపిల్ వాచ్ 7 సిరీస్ కూడా లాంచ్ కానుంద‌ని తెలుస్తోంది. యాపిల్ ఇప్ప‌టివ‌ర‌కు లాంచ్ చేసిన వాచ్ ల‌న్నీ దాదాపు ఒకే డిజైన్ తో వ‌చ్చాయి. అయితే యాపిల్ వాచ్ 7 సిరీస్ లో మాత్రం డిజైన్ ప‌ర‌మైన మార్పులు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 41ఎంఎం, 45ఎంఎం వేరియంట్ల‌లో ఈ వాచ్ లాంచ్ కానున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో లాంచ్ అయిన వాచ్ ల్లో 40 ఎంఎం, 44 ఎంఎం వేరియంట్ల‌ను అందించారు.

3. యాపిల్ ఎయిర్ పోడ్స్ 3
యాపిల్ అత్యంత చ‌వకైన ఇయ‌ర్ బ‌డ్స్ ను కూడా ఈ కార్య‌క్ర‌మంలో లాంచ్ చేయ‌నుంద‌ని స‌మాచారం. అవే యాపిల్ ఎయిర్ పోడ్స్ 3. గ‌తంలో లాంచ్ అయిన ఎయిర్ పోడ్స్ కంటే వీటి డిజైన్ లో కూడా మార్పులు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

4. సాఫ్ట్ వేర్ అప్ డేట్లు
యాపిల్ ఫోన్లు కొనాల‌నుకునేవారు ఈ ఈవెంట్లో లాంచ్ అయ్యే ఫోన్ల కోసం చూస్తే.. ఇప్ప‌టికే యాపిల్ ఉత్ప‌త్తులు వాడేవారు మాత్రం సాఫ్ట్ వేర్ అప్ డేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యాపిల్ ఈవెంట్లో ఐవోఎస్ 15, ఐప్యాడ్ ఓఎస్ 15, వాచ్ ఓఎస్ 8, టీవీ ఓఎస్ 15 కూడా ఈ ఈవెంట్లోనే లాంచ్ అవుతాయ‌ని అంచ‌నా.

Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధార‌ణ‌ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మ‌న‌దేశంలో లాంచ్!

Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచ‌ర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వ‌చ్చేసింది!

Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫ‌ర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాల‌కు మాత్ర‌మే తీసేసిన టెలికాం!

Tags: iPhone 13 series Apple Event Apple Event 2021 Apple Watch 7 Series Apple Airpods 3 iOS 15

సంబంధిత కథనాలు

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Google Search: గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచర్.. కళ్లకు ఊరటనిచ్చేలా.. ఇలా ఆన్ చేసుకోండి!

Google Search: గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచర్.. కళ్లకు ఊరటనిచ్చేలా.. ఇలా ఆన్ చేసుకోండి!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Samsung A03: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది... ధర రూ.10 వేలలోపే?

Samsung A03: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది... ధర రూ.10 వేలలోపే?

Budget Mobile: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!

Budget Mobile: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!

టాప్ స్టోరీస్

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

Umarkot Shiv Mandir: శత్రుదేశంలో శివనామస్మరణ, రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..

Umarkot Shiv Mandir: శత్రుదేశంలో శివనామస్మరణ,  రోజురోజుకీ  పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..