ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మనదేశంలో లాంచ్!
టెక్ దిగ్గజం అమెజాన్ తన కొత్త టీవీ స్టిక్ ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్. దీని ధరను రూ.6,499గా నిర్ణయించారు.
అమెజాన్ తన కొత్త ఫైర్ టీవీ స్టిక్ ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్. గతంలో లాంచ్ అయిన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే. తమ అన్ని స్ట్రీమింగ్ స్టిక్ ల్లో ఇదే అత్యుత్తమం అయినదని అమెజాన్ అంటోంది. వైఫై 6, డాల్బీ విజన్ ఫార్మాట్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్ ధర
దీని ధరను మనదేశంలో రూ.6,499గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే అమెజాన్ లో ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన షిప్ మెంట్లు అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
గతంలో లాంచ్ అయిన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్ కంటే ఇది 40 శాతం ఎక్కువ శక్తివంతం అయిందని కంపెనీ పేర్కొంది. మీడియాటెక్ ఎంటీ8696 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. వైఫై 6 కనెక్టివిటీని ఇందులో అమెజాన్ అందించింది.
దీంతోపాటు బ్లూటూత్ వీ5.0ని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. బ్లూటూత్ స్పీకర్లు, హెడ్ ఫోన్లు, వీడియో గేమ్ కంట్రోలర్లు వంటివి కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చన్న మాట. హెచ్ డీఆర్, హెచ్ డీఆర్10+ ఫార్మాట్లతో పాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
మూడో తరం అలెక్సా రిమోట్ ను కూడా ఈ స్టిక్ తో పాటు అందించనున్నారు. ఇది మార్చిలో లాంచ్ అయింది. గతంలో రెగ్యులర్ ఫైర్ టీవీ స్టిక్ తో కూడా దీన్ని అందించేవారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్ ఫ్లిక్స్ లకు ఇందులో ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి.
దీని మందం 1.4 సెంటీమీటర్లుగా కాగా, బరువు 48.4 గ్రాములు మాత్రమే. ఇందులో లైవ్ వ్యూ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా వినియోగదారులు టీవీ చూస్తూనే.. తమ ఇంట్లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ను పీఐపీ ఫీడ్ ద్వారా చూడవచ్చు.
Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వచ్చేసింది!
Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తీసేసిన టెలికాం!
Also Read: Whatsapp: లుక్ అందంగా.. ప్రైవసీ పటిష్టంగా.. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్లు ఇవే!