News
News
X

55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచ‌ర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వ‌చ్చేసింది!

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ బ్రాండ్ టీసీఎల్ త‌న కొత్త స్మార్ట్ టీవీని మ‌న‌దేశంలో లాంచ్ చేసింది. అదే ఐఫాల్క‌న్ కే72 55 అంగుళాల టీవీ.

FOLLOW US: 
 
ప్ర‌ముఖ టీవీ కంపెనీ టీసీఎల్ కు స‌బ్ బ్రాండ్ ఐఫాల్క‌న్ మ‌న‌దేశంలో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అదే ఐఫాల్క‌న్ కే72 4కే స్మార్ట్ టీవీ. ఇందులో 55 అంగుళాల 4కే డిస్ ప్లేను అందించారు. డాల్బీ విజ‌న్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం ఎక్స్ ట‌ర్న‌ల్ కెమెరాను కూడా ఇందులో అందించారు.

ఐఫాల్క‌న్ కే72 55 అంగుళాల 4కే టీవీ ధ‌ర‌
ఈ టీవీ ధ‌ర‌ను మ‌న‌దేశంలో రూ.51,999గా నిర్ణ‌యించారు. దీన్ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ లో మాత్రమే ఈ టీవీ అందుబాటులో ఉంది. దీనిపై ఒక సంవ‌త్స‌రం వారంటీని కూడా కంపెనీ అందించ‌నుంది.

ఈ టీవీకి సంబంధించి ఈఎంఐలు రూ.1,778 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టీవీపై ప‌లు బ్యాంక్ ఆఫ‌ర్ల‌ను కూడా అందించ‌నున్నారు.

ఐఫాల్క‌న్ కే72 55 అంగుళాల 4కే టీవీ స్పెసిఫికేష‌న్లు
ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11 ఆప‌రేటింగ్ సిస్టంపై ప‌నిచేయ‌నుంది. ఇందులో 55 అంగుళాల 4కే డిస్ ప్లేను అందించారు. డాల్బీ విజ‌న్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీడియోకాల్స్ కోసం ఎక్స్ ట‌ర్న‌ల్ కెమెరా అందించారు.

News Reels

హెచ్ డీఆర్, హెచ్ డీఆర్10 ఫార్మాట్ల‌ను ఈ టీవీ స‌పోర్ట్ చేయ‌నుంది. ఎంఈఎంసీ ద్వారా మెరుగైన విజువ‌ల్స్ కూడా ఈ టీవీ అందించ‌నుంది. యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ యాప్స్ ఇందులో ముందుగానే ఇన్ స్టాల్ అయి రానున్నాయి. మిగ‌తా యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవ‌చ్చు.

హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ 2.0 ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది. మూడు హెచ్ డీఎంఐ 2.1 పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు, ఒక ఎథ‌ర్ నెట్ పోర్టు, ఎస్పీడీఐఎఫ్ పోర్టు, బ్లూటూత్ ఇందులో ఉన్నాయి. డ్యూయ‌ల్ బ్యాండ్ వైఫైని ఇది స‌పోర్ట్ చేయ‌నుంది.

Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫ‌ర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాల‌కు మాత్ర‌మే తీసేసిన టెలికాం!

Also Read: Whatsapp: లుక్ అందంగా.. ప్రైవ‌సీ ప‌టిష్టంగా.. వాట్సాప్ తీసుకురానున్న కొత్త‌ ఫీచ‌ర్లు ఇవే!

Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వ‌చ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచ‌ర్లు!

Also Read: రూ.15 వేల‌లోపే భార‌తీయ బ్రాండ్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచ‌ర్లు!

Published at : 12 Sep 2021 04:43 PM (IST) Tags: iFFalcon iFFalcon K72 iFFalcon K72 55 inch 4K Smart TV New Smart TV Smart TV

సంబంధిత కథనాలు

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?