(Source: ECI/ABP News/ABP Majha)
Google Chrome: గూగుల్ క్రోమ్‌లోని ఎక్స్‌టెన్షన్‌లు వాడుతున్నారా? వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి, లేకపోతే..
మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అందులో ఈ 5 ఎక్స్‌టెన్షన్‌లు వినియోగిస్తున్నారా? అయితే మీకు ముప్పు తప్పదు..
గూగుల్ క్రోమ్ వినియోగదారులు సాధారణంగా పలు అవసరాల కోసం ఎక్స్‌టెన్షన్‌లు వాడుతుంటారు. వీటి వినియోగం మూలంగా కొన్ని అదనపు సేవలు పొందే అవకాశం ఉంటుంది. కానీ, కొన్ని ఎక్స్‌టెన్షన్స్ మూలంగా మీ డేటా దొంగిలించబడటమే కాకుండా మీ ప్రైవసీకి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు తేలింది.
గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ గురించి McAfee తాజాగా నివేదిక పలు సంచలన విషయాలను వెల్లడించింది. పలు క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ వినియోగదారుల డేటాను తొలగించడమే కాకుండా.. గోప్యతకు పెద్ద ముప్పును కలిగిస్తున్నట్లు తెలిపింది. అందులో అత్యంత ప్రమాదకరమైన 5 గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ గురించి వెల్లడించింది. అయితే ఇవన్నీ బాగా పాపులర్ అయిన ఎక్స్‌టెన్షన్స్ కావడం విశేషం. వీటి ద్వారా కలిగే ముప్పు గురించి తెలియకుండా పలువురు వినియోదారులు ఎక్స్‌టెన్షన్స్ ను వాడుతున్నారు.. ఆ 5 ప్రమాదకరమైన ఎక్స్‌టెన్షన్స్ ఇవే..
- నెట్‌ఫ్లిక్స్ పార్టీ
- నెట్‌ఫ్లిక్స్ పార్టీ 2
- ఫ్లిప్‌షాప్
- ఫుల్ పేజీ స్క్రీన్‌షాట్ క్యాప్చర్
- ఆటోబై ఫ్లాష్ సేల్స్
ఈ ఎక్స్‌టెన్షన్ వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ షోలను కలిసి చూడటం, వెబ్‌సైట్ కూపన్‌లు, వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌లను తీయడం సహా పలు సేవలను అందిస్తున్నాయి. అయినప్పటికీ.. వినియోగారులు వెబ్‌సైట్‌కి వచ్చిన ప్రతిసారీ పేజీ URLని రిమోట్ సర్వర్‌కు పంపడం ద్వారా వినియోగదారుల బ్రౌజింగ్ యాక్టివిటీని ట్రాక్ చేస్తారని McAfee నివేదిక పేర్కొంది. అంతేకాదు.. యూజర్లు eCommerce వెబ్‌సైట్లను సందర్శించి కూపన్ కోడ్స్ ఎంటర్ చేస్తుంటారు. ఆ సమయంలో సైట్‌లోని కుక్కీలు సవరించబడతాయి. దీంతో కొనుగోలు చేసిన ఏదైనా వస్తువులకు అనుబంధ చెల్లింపులను స్వీకరించే అవకాశం ఉందని McAfee పేర్కొంది.
అత్యంత హానికరమైన ఎక్స్‌టెన్షన్‌ల జాబితాలో 'నెట్‌ఫ్లిక్స్ పార్టీ' ఉండటం విశేషం. ఎంతో మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో దీని ప్రమాదకరమైన కార్యకలాపాలకు సంబంధించి McAfee హెచ్చరించింది. ఈ ఎక్స్‌టెన్షన్ ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ పార్టీ ఎక్స్‌టెన్షన్‌ను క్లోన్ చేసిందని తన నివేదికలో పేర్కొంది. ఇది ఒకే సమయంలో నెట్‌ఫ్లిక్స్ షోలను చూడటానికి ఎంతో మంది వ్యక్తులను అనుమతిస్తుంది. ఈ నకిలీ వెర్షన్ యూజర్లు సందర్శించిన అన్ని వెబ్‌సైట్‌లను ట్రాక్ చేస్తుంది. ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం వారి వివరాలలను దుర్వినియోగం చేస్తుంది.
ఈ ఎక్స్టెన్షన్స్ యూజర్లు చాలా ఎక్కువ
- నెట్‌ఫ్లిక్స్ పార్టీ ఇప్పటి వరకు 80,00,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది.
- నెట్‌ఫ్లిక్స్ పార్టీ 2ని ఇప్పటి వరకు 3,00,000 కంటే ఎక్కువ మంది వాడుతున్నారు.
- ఫ్లిప్‌షాప్ ఇప్పటి వరకు 80,000 మంది వినియోగదారులను కలిగి ఉంది.
- ఫుల్ పేజీ స్క్రీన్‌షాట్ క్యాప్చర్ ఇప్పటి వరకు 2,00,000 మంది వాడుతున్నారు.
- ఆటోబై ఫ్లాష్ సేల్స్ ఇప్పటి వరకు 20,000 మంది వినియోగదారులను సంపాదించింది.
McAfee ఈ సంవత్సరం మార్చిలో పలు హానికరమైన Chrome ఎక్స్‌టెన్షన్స్ ను కనుగొన్నది. ఈ ఎక్స్‌టెన్షన్స్ ఇండియాతో పాటు అమెరికా ఐరోపా దేశాల్లో ఎక్కువగా వాడుతున్నట్లు వెల్లడించింది.
Also Read: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!