News
News
X

Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!

అసలు యాప్స్ ఎందుకు అప్‌డేట్ చేయాలి?

FOLLOW US: 
Share:

APP Update: మనమందరం మన స్మార్ట్‌ఫోన్‌లలో అనేక రకాల యాప్‌లను ఉపయోగిస్తాము. ఈ యాప్‌లు మన పనిని సులభతరం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఫోన్‌లో చాలా రకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రతి టాస్క్‌కు ప్రత్యేక యాప్ ఉంటుంది. ఈ యాప్‌ల అప్‌డేట్‌లు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు యాప్ అప్‌డేట్ కాకపోతే సరిగ్గా పని చేయదు. యాప్‌ అప్‌డేట్‌ వచ్చినా చాలా మంది యాప్‌ను అప్‌డేట్‌ చేయరు. మీరు యాప్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా చేయకపోతే దాని వల్ల చాలా నష్టాలు ఉంటాయి.
   
యాప్ అప్‌డేట్ అంటే ఏమిటి?
యాప్ అప్‌డేట్‌లు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తాయి. ఇది మాత్రమే కాదు. అవి మీ ఫోన్ నుంచి మాల్వేర్‌ను, బగ్‌లను కూడా తొలగిస్తాయి. మొబైల్ యాప్‌ను తయారు చేసే ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది. అందుకే యాప్‌కు మార్పులు చేసిన ప్రతిసారీ మనకు అప్‌డేట్‌లు వస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మీ యాప్‌లో మెరుగుదల, భద్రతను కోరుకుంటే, అప్‌డేట్‌లు క్రమం తప్పకుండా చేసుకోవాలి. అంటే యాప్‌ను సెక్యూరిటీ ప్యాచ్ వచ్చినప్పుడు అప్‌డేట్ చేయకపోతే మీ డేటా ప్రమాదంలో ఉన్నట్లు అన్న మాట.

అనేక ఫీచర్లు అందుబాటులోకి...
యాప్ అప్‌డేట్‌లు బగ్‌లను తొలగించడమే కాకుండా యాప్‌కి కొత్త ఫీచర్‌లను జోడిస్తాయి. దీనితో పాటు అవసరమైన మార్పులు కూడా జరుగుతాయి. కొన్నిసార్లు యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, దాని డిజైన్ మార్పులు లేదా కొత్త ఫీచర్‌లు యాడ్ అవ్వడాన్ని మీరు గమనించి ఉండాలి.

అప్‌డేట్ ద్వారా లోపాలు సరి
యాప్‌ను డెవలప్ చేస్తున్నప్పుడు ఏదైనా లోపం ఉంటే, ఆ లోపాన్ని అప్‌డేట్స్ ద్వారా సరిదిద్దుతారు. యాప్‌ను తయారు చేసే కంపెనీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను విడుదల చేయడానికి ఇదే కారణం. అదనంగా అప్‌డేట్ యాప్‌కి సరికొత్త సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. దీని వల్ల ఆ యాప్ మరింత సెక్యూర్డ్‌గా మారుతుంది. కాబట్టి మీరు మీ యాప్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

ఉదాహరణకు వాట్సాప్‌నే తీసుకోండి. వారు ఎప్పటికప్పుడు తమ యాప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. వాట్సాప్‌లో ఇటీవలే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ‘ఎల్లో పేజెస్’ తరహా ఫీచర్. ఇది వాట్సాప్‌లో బిజినెస్‌లను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. WhatsApp ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్. బ్రెజిల్‌తో మొట్టమొదటగా "డైరెక్టరీ" ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు WhatsApp శుక్రవారం తెలిపింది, దీని ద్వారా వినియోగదారులు సమీపంలోని స్థానిక చిన్న వ్యాపారాలను బ్రౌజ్ చేయవచ్చు, కనుగొనవచ్చు. డైరెక్టరీని మొదట సావో పాలోలో WhatsApp పరీక్షించింది. పూర్తిగా విజయవంతమైన తర్వాత దీన్ని బ్రెజిల్‌లో విడుదల చేయబోతున్నారు.

WhatsApp బిజినెస్ సెర్చ్‌ను కూడా ప్రకటించింది, దీని ద్వారా వినియోగదారులు దాని API ద్వారా పెద్ద బ్రాండ్‌లను కనుగొనగలరు. ఇది బ్రెజిల్, యూకే, ఇండోనేషియా, మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అందుబాటులో ఉంది.

"వ్యక్తులు చాట్ చేయాలనుకుంటున్న బిజినెస్‌ను కనుగొన్న తర్వాత, ఉత్పత్తికి సంబంధించి వారికి ఉన్న ప్రశ్నలను అడగవచ్చు. వారి వస్తువులు, సేవల కేటలాగ్‌ను బ్రౌజ్ చేయవచ్చు. కార్ట్‌లో వస్తువులను యాడ్ చేయవచ్చు. తద్వారా వారు ఏమి కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ నిర్వాహకులకు తెలుస్తుంది." అని కంపెనీ తెలిపింది.

Published at : 28 Jan 2023 04:55 PM (IST) Tags: Tech News Apps Updating Apps App Update

సంబంధిత కథనాలు

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు