Telegram WhatsApp Paid Service : టెలిగ్రామ్, వాట్సప్ వాడాలంటే ఇక డబ్బులు కట్టాల్సిందేనా ? ఆ కంపెనీల కొత్త ప్లాన్ తెలుసా ?
మెసెజింగ్ యాప్ టెలిగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ దిశగా అడుగులేస్తోంది. టెలిగ్రామ్ సక్సెస్ అయితే వాట్సప్ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది.
"వాట్సప్" యాప్ లేకుండా ఉండగలరా ?. అసలు ఉండలేరు. ఫేస్ బుక్ లేకుండా ఉండగలం... ట్విట్టర్ లేకుండా ఉండగలం కానీ వాట్సప్ లేకుండా మాత్రం ఉండలేం. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి చాలు కదా వాట్సప్ కంపెనీ ఎంత కావాలంటే అంత ఫీజు పెట్టి లాభాలు దండుకోవడానికి. వాట్సాప్ ఏడాదికి రూ. యాభై చార్జి వసూలు చేసేది. కానీ తర్వాత తొలగించింది. ఇప్పటికైతే టోటల్ ప్రీ. కానీ ఇక ముందు డబ్బులు వసూలు చేయడం ఖాయమన్న ప్రచారం ప్రారంభమయింది.
ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరిక వాట్సాప్ వాడలేరు !
వాట్సప్ తరహాలోనే టెలిగ్రామ్ యాప్ కూడా ఎక్కువ మందికి చేరువైంది. గత ఏడాది వాట్సప్ ప్రైవసీ పాలసీపై ఎలన్ మస్క్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినర తర్వాత వాట్సప్ తరహా ప్రత్యామ్నాయ యాప్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అలా భారీగా సబ్‌స్క్రయిబర్లను పెంచుకున్న మెసెజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ముందు ఉంది. వాట్సప్‌ను మించిన విధంగా టెలిగ్రామ్‌లో సేవలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులు.. సంస్థలు.. సులువుగా వాడుకునేలా ఉంటుంది. అందుకే టెలిగ్రామ్ కు బాగా ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు టెలిగ్రామ్ సంస్థ తమ సేవలకు డబ్బులు వసూలు చేయాలనుకుంటోంది.
అయితే ఇప్పుడున్న వెర్షన్‌కు డబ్బులు వసూలు చేస్తే మైనస్ అవుతుంది కాట్టి.. టెలిగ్రామ్ యాప్ ప్రీమియం వెర్షన్ తీసుకువచ్చి...కొన్ని ఫీచర్లను ప్రీమియం పరిధిలోకి చేరుస్తారు. ఆ సేవలు పొందాలంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ ఫీజులు వసూలు చేయనున్నారు. ఇది ఎంత ఉంటుంది.. ప్రీమియం యాప్‌లో ఎన్ని ప్రత్యేకతలు ఉంటాయి.. అవి ఎంత వరకూ ప్రజలకు ఉపయోగపడతాయన్నదానిపై పెయిడ్ సబ్‌స్క్రయిబర్లు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం వెర్షన్ ను టెలిగ్రామ్ యాప్ త్వరలోనే అందుబాటులోకి తేనుంది.
ప్లే స్టోర్ నుంచి 12 లక్షల యాప్స్ నిషేధించిన టెక్ దిగ్గజం గూగుల్, కీలక ప్రకటన
ప్రస్తుతానికి వాట్సప్ సేవలు మాత్రం ఉచితమే. కానీ టెలిగ్రామ్ తమ ప్రీమియం సేవల ద్వారా ఆదాయం పొందితే మాత్రం వాట్సప్ కామ్‌గా ఉండే అవకాశం లేదు. సంపాదన మీద పడుతుంది. వాట్సప్ ఇప్పటికే అనేక రకాల సేవలు అందిస్తోంది. పేమెంట్ సర్వీస్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో వాట్సప్ మరిన్ని ఆధునిక ఫీచర్లను ఏర్పాటు చేసి... పెయిడ్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే... మనం రోజువారీ వ్యవహారాల్లో వాడే యాప్స్‌కూ డబ్బులు కట్టడం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ప్రారంభమయ్యాయి.. నెక్ట్స్ మెసెజింగ్ యాప్స్.. తర్వాత ఇతర యాప్స్. రాబోయేది ఖర్చుల కాలమే.