అన్వేషించండి

WhatsApp Block : ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరిక వాట్సాప్ వాడలేరు !

ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయిపోతున్నాయి. వాట్సాప్ బ్లాక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

WhatsApp Block :  వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో కీలకం. వ్యక్తిగతంగానే కాదు..  ఉద్యోగ విధుల నిర్వహణలోనూ వాట్సాప్ కీలకం. అయితే వాట్సాప్ సంస్థ ఇటీవల పెద్ద ఎత్తున ఖాతాల్ని బ్లాక్ చేస్తోంది. ఒక్క మార్చిలోనే 18 లక్షల మంది వాట్సాప్ వాడకుండా నిషేధించింది ఇలా ప్రతీ నెలా లక్షల మందిని వాట్సాప్ కు దూరం చేస్తూనే ఉంది. ఇలా చేస్తూ పోతే ఏదో ఒక రోజు మన ఖాతాను కూడా బ్లాక్ చేసే ప్రమాదం ఉంది. వాట్సాప్ ఊరకనే ఖాతాలను బ్లాక్ చేయదు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో మనం తెలుసుకుంటే.. జాగ్రత్తగా ఉండొచ్చు.
 
వాట్సప్ యాప్ ఉపయోగించాలంటే కొన్ని రూల్స్‌ను పాటించాలి. యాప్‌ను ఇన్ స్టాల్ చేసే సమయంలోనే మనం ఆ మేరకు రూల్స్ పాటిస్తామని కన్సెంట్ ఇస్తాం. యూజర్లు తప్పనిసరిగా ఆ నియమనిబంధనల్ని పాటించాల్సిందే. లేకపోతే వాట్సాప్ బ్లాక్ అయిపోయింది. అకౌంట్ బ్లాక్ అయిపోతున్న వారిలో ఎక్కువ మంది చేస్తున్న తప్పు అనధికారిక యాప్ వాడటం.  యూజర్లు వాట్సప్ ఒరిజినల్ యాప్ ను ఉపయోగించకపోవడం.  గూగుల్ ప్లేస్టోర్‌లో, ఆన్‌లైన్‌లో అనధికార యాప్స్ కూడా ఉంటాయి. వాట్సప్ ప్లస్, జీబీ వాట్సప్, వాట్సప్ మోడ్ లాంటి అనధికార యాప్స్ ఉపయోగించకూడదు.అలా వాడితే అకౌంట్ బ్లాక్ చేసేస్తారు. 

అదే సమయంలో వాట్సాప్ యూజర్లు  ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజెస్ పంపుతున్నా ...వాటిపై ఫిర్యాదులు వచ్చినా మీ అకౌంట్‌ని వాట్సప్ బ్లాక్ చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎక్కువ మంది వాట్సప్‌లో బ్లాక్ చేసినా మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. యూజర్లు వాట్సప్‌లో ఆటోమేటెడ్, బల్క్ మెసేజింగ్, స్పామ్ మెసేజింగ్ చేసినా వారి వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది.
ఒకవేళ మిమ్మల్ని వాట్సప్ తాత్కాలికంగా బ్లాక్ చేస్తే అన్‌బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు వాడుతున్న అనధికార వాట్సప్ అకౌంట్‌ను డిలిట్ చేయాలి.  మళ్లీ అదే తప్పు చేస్తే మ  శాశ్వతంగా అకౌంట్‌ను బ్లాక్ చేస్తుంది వాట్సప్. బ్లాక్ అయిన మీ వాట్సప్ అకౌంట్‌ను రీస్టోర్ చేయాలంటే వాట్సప్ సపోర్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మీ అకౌంట్‌ను రివ్యూ చేసిన తర్వాత యాక్టివేట్ అవుతుంది.

వాట్సాప్ ఇప్పుడు ఎంత ఉపయోగకరమో.. అంత వినాశకరంగా మారింది. ఫేక్ న్యూస్‌కు వాట్సాప్ అడ్డాగా మారింది. ఇలాంటి పరిస్థితుల్ని మార్చడానికి కేంద్రం కూడా ఎన్నోచట్టాల్ని తీసుకు వచ్చింది. వాట్సాప్ కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. యూజర్లు కూడా అంతే జాగ్రత్తగా ఉంటే వాట్సాప్ సేఫ్‌గా ఉంటుంది.. వాడకం కూడా సేఫ్‌గా ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Medical Colleges Issue: ఇవే జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు - వైసీపీని వీడియోలతో ఇరకాటంలో పెట్టిన టీడీపీ
ఇవే జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు - వైసీపీని వీడియోలతో ఇరకాటంలో పెట్టిన టీడీపీ
Telangana Latest News: హైద‌రాబాద్ నుంచి బంద‌రు పోర్టు వరకు 12 వరుసల రోడ్డు- కేంద్రం ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన 
హైద‌రాబాద్ నుంచి బంద‌రు పోర్టు వరకు 12 వరుసల రోడ్డు- కేంద్రం ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన 
Andhra Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
Telangana Formula E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
Advertisement

వీడియోలు

Nepal Youth Dancing After Gen Z protest | పార్లమెంటు దగ్ధం ఘటనలో వైరల్ అవుతున్న నేపాల్ కుర్రాడు | ABP Desam
Nepal Gen Z Protest Explained in Telugu | జెన్ Z కి కడుపు మండితే రివోల్ట్ ఈ రేంజ్ లో ఉంటుందా.? | ABP Desam
Why Asia Cup Format Changes | ఆసియా కప్ ఫార్మాట్ ఎందుకు మారుతుంటుంది? | ABP Desam
Shivam Dube in Asia CUp 2025 | సమస్యగా మరీనా శివమ్ దూబే | ABP Desam
Pak Spinner Mohammad Nawaz Asia Cup 2025 | పాక్ స్పిన్నర్ తో భారత్ బ్యాటర్లకు సవాల్!   | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Medical Colleges Issue: ఇవే జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు - వైసీపీని వీడియోలతో ఇరకాటంలో పెట్టిన టీడీపీ
ఇవే జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు - వైసీపీని వీడియోలతో ఇరకాటంలో పెట్టిన టీడీపీ
Telangana Latest News: హైద‌రాబాద్ నుంచి బంద‌రు పోర్టు వరకు 12 వరుసల రోడ్డు- కేంద్రం ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన 
హైద‌రాబాద్ నుంచి బంద‌రు పోర్టు వరకు 12 వరుసల రోడ్డు- కేంద్రం ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన 
Andhra Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
Telangana Formula E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్‌ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్ 
Telusu Kada Teaser: తెలుసు కదా... స్టార్ బాయ్ సిద్ధూ ముక్కోణపు ప్రేమకథా చిత్రమ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుసు కదా... స్టార్ బాయ్ సిద్ధూ ముక్కోణపు ప్రేమకథా చిత్రమ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Brave Woman Dead: మంటల్లో కాలిపోతూ ఆస్పత్రికి వచ్చింది - అంత ధైర్యం ప్రాణాల్ని కాపాడలేకపోయింది!
మంటల్లో కాలిపోతూ ఆస్పత్రికి వచ్చింది - అంత ధైర్యం ప్రాణాల్ని కాపాడలేకపోయింది!
Bigg Boss Telugu 9 Day 2 Promo 2&3 : బిగ్​బాస్​ సీజన్ 9లో మొదలైన ఏడ్పులు.. సేఫ్ నామినేషన్స్​తో వచ్చిన కంటిస్టెంట్​లు
బిగ్​బాస్​ సీజన్ 9లో మొదలైన ఏడ్పులు.. సేఫ్ నామినేషన్స్​తో వచ్చిన కంటిస్టెంట్​లు
Nepal Protests: నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
నెపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
Embed widget