అన్వేషించండి

Tecno Spark Go 2022: రూ.8 వేలలోపే స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో స్పార్క్ గో 2022.

టెక్నో స్పార్క్ గో 2022 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ గో 2021కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. టెక్నో స్పార్క్ గో 2022 ఫీచర్లు ఇంతకు ముందు వెర్షన్ తరహాలోనే ఉన్నాయి. ఇందులో డీటీఎస్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంది.

టెక్నో స్పార్క్ గో 2022 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. టర్కోయిస్ సియాన్ కలర్ వేరియంట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

టెక్నో స్పార్క్ గో 2022 స్సెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో ఉన్న సో ప్లే 2.0 అనే ఫీచర్ ద్వారా మీరు సొంతంగా మ్యూజిక్ ట్రాక్స్ కూడా కంపోజ్ చేసుకోవచ్చు.

2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టెంట్ బిల్డ్ కూడా ఇందులో ఉంది. బయోమెట్రిక్ అన్‌లాకింగ్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు కంపెనీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందించింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే. .ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా.. బరువు 199 గ్రాములుగా ఉంది.

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Tecno Spark Go 2022: రూ.8 వేలలోపే స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget