(Source: ECI/ABP News/ABP Majha)
Smartphone Battery Tips: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
Mobile Battery Charging: మనమందరం మొబైల్స్ ఉపయోగిస్తాం. మొబైల్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మొబైల్ లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు తమ మొబైల్స్ నుంచి చాలా పనులు చేయడం ప్రారంభించారు. ఇందులో కాల్ చేయడం, మెసేజింగ్ చేయడం, షాపింగ్ చేయడం, పేమెంట్స్ చేయడం, టిక్కెట్స్ బుక్ చేసుకోవడం మొదలైనవి ఉంటాయి. మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా దాని లైఫ్ గురించి ఆలోచించారా? మీరు దీన్ని సరైన మార్గంలో ఛార్జ్ చేయడం గురించి ఆలోచించారా?
ఫోన్ ఛార్జింగ్ ఎలా చేయాలి?
మీరు రోజంతా ఫోన్‌ని ఉపయోగిస్తే, దాన్ని అన్ని సమయాలలో ఫుల్ ఛార్జ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. ఫోన్‌ను సరిగ్గా ఛార్జ్ చేయడానికి కూడా ఒక మార్గం ఉంది. మీరు ఫోన్‌ను సరిగ్గా ఛార్జ్ చేస్తే, మీ ఫోన్ బ్యాటరీ జీవితం బాగుంటుంది. కాబట్టి ఈ కింద తెలిపిన రెండు విషయాలను కచ్చితంగా ఫాలో అవ్వండి.
ఫోన్‌ను ఎంత పర్సెంట్ మేర చార్జ్ చేయాలి?
చాలా మంది ఫోన్‌ని 100 శాతం ఫుల్ ఛార్జింగ్ చేసి ఆ తర్వాత హాయిగా వాడుకుందామని అనుకుంటారు. ఇది బ్యాటరీని ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అనుకుంటాం. కానీ అది అలా కాదు. 80 నుంచి 90 శాతం వరకు ఫోన్ మాత్రమే ఛార్జ్ చేయాలని నిపుణులు భావిస్తున్నారు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడం స్మార్ట్‌ఫోన్ జీవితానికి మంచిది కాదు. కాబట్టి ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేయవద్దు.
ఫోన్ ఎప్పుడు ఛార్జ్ చేయాలి?
కొంత మంది ఫోన్ పూర్తిగా చార్జ్ అయిపోయాక చార్జింగ్ పెడుతుంటారు. మీరు కూడా అలాంటి వ్యక్తులలో ఉంటే, ఇది చేయకూడదని తెలుసుకోండి. ఫోన్ బ్యాటరీ 20 శాతం ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. బ్యాటరీని 20 నుండి 80 శాతం వరకు ఉంచడం మీ ఫోన్‌కు మంచిదని అందరూ చెప్తున్నారు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram