News
News
X

Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం.

FOLLOW US: 
Share:

Second Hand Smartphone: నేటి కాలంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో చాలా మంది వినియోగదారులు సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్‌ను ఆప్షన్‌గా పెట్టుకుంటారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. అయితే, సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. భారతదేశంలో సెకండ్ హ్యాండ్ మొబైల్‌ను కొనుగోలు చేసేటప్పుడు, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 1. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనడానికి ముందు, దాని భౌతిక స్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. గీతలు, డెంట్లు వంటివి ఉన్నాయో లేదో చూసుకోండి. ఫోన్ బటన్‌లు, టచ్‌స్క్రీన్, కెమెరా, ఇతర ఫీచర్‌లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేయండి.
 2. అత్యంత సాధారణ మొబైల్ ఫోన్ సమస్యలలో వాటర్ డ్యామేజ్ ఒకటి. దీనిని నిర్ధారించడం కూడా కష్టం. అయితే దీన్ని గుర్తించడానికి మీరు ఫోన్‌ తుప్పు పట్టడం లేదా స్క్రీన్‌పై నీటి మరకలను ఉన్నాయో లేవో చూడవచ్చు.
 3. మొబైల్ ఫోన్‌లో బ్యాటరీ ఒక ముఖ్యమైన భాగం. దానిని మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్నది. బ్యాటరీ జీవితకాలాన్ని తనిఖీ చేయండి. ఒకే ఛార్జ్‌తో ఫోన్ ఎంతకాలం ఉంటుందో విక్రేతను అడగండి.
 4. ఫోన్ ఛార్జర్, హెడ్‌ఫోన్‌లు, బాక్స్ వంటి ఒరిజినల్ యాక్సెసరీస్‌తో వస్తోందో లేదో చెక్ చేయండి. లేకపోతే ధర తగ్గించమని అడగండి.
 5. విక్రేతను కలిసినప్పుడు మాల్ లేదా కాఫీ షాప్ వంటి అనేక మంది వ్యక్తులు ఉండే పబ్లిక్ ప్లేస్‌ని ఎంచుకోండి. ఇది మీ భద్రతకు ముఖ్యం. ఏదైనా మోసాన్ని నివారిస్తుంది.
 6. బేరసారాలు చేసేటప్పుడు తక్కువ ధరకు అడగటం ఎల్లప్పుడూ మంచి ఒప్పందం కాదని గుర్తుంచుకోండి. ఫోన్ మంచి కండిషన్‌లో ఉండి, దాన్ని అన్ని ఒరిజినల్ యాక్సెసరీస్‌తో డెలివరీ చేస్తుంటే మరీ తక్కువకు .
 7. చివరగా విక్రేత నుంచి రసీదు తీసుకోండి. భవిష్యత్తులో ఫోన్‌లో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ఇది మీకు సహాయం చేస్తుంది.
 8. ఫోన్ IMEI నంబర్ గురించి విక్రేతను అడగండి. అది దొంగ ఫోనా కాదా అనేది కూడా ఆన్‌లైన్‌లో తనిఖీ చేయండి. అలాగే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఫోన్ బ్లాక్‌లిస్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
 9. ఫోన్ ఇప్పటికీ వారంటీలో ఉందో లేదో చెక్ చేయండి. ఒకవేళ వారంటీ ఉంటే, దాన్ని మీ పేరుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఫోన్‌కు సమస్యలు తలెత్తితే ఇది మీకు సహాయం చేస్తుంది.
 10. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను తనిఖీ చేయండి. అది అప్‌డేటెడ్‌గా ఉందని నిర్ధారించుకోండి. ఫోన్‌లో మాల్‌వేర్ లేదా వైరస్ లేవని కూడా కన్ఫర్మ్ చేసుకోండి.

ఒకవేళ మీరు ఐఫోన్ కొంటున్నట్లు అయితే సెట్టింగ్స్‌లో బ్యాటరీ లైఫ్ చెక్ చేసుకోండి. నాలుగు జనరేషన్ల కంటే ముందు మొబైల్ అయితే కొనకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ తర్వాత సాఫ్ట్ వేర్ అప్‌డేట్స్ అందించడం ఆపేస్తారు.

Published at : 19 Mar 2023 10:44 PM (IST) Tags: smartphone Tech News Second Hand Smartphone Second Hand Smartphone Buying Guide Second Hand Smartphone Buying Tips

సంబంధిత కథనాలు

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!