అన్వేషించండి

Samsung Gaming Monitor: శామ్‌సంగ్ నుంచి మినీ గేమింగ్ మానిటర్

ప్రపంచంలోనే మొట్టమొదటి మినీ ఎల్ఈడీ గేమింగ్ మానిటర్‌ను శామ్‌సంగ్ ఆవిష్కరించింది. దీని పేరు శామ్‌సంగ్ ఒడిస్సీ నియో జీ 9 (Odyssey Neo G9). ఈ గేమింగ్ మానిటర్ కర్వ్‌డ్ (curved) డిస్‌ప్లేతో రానుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి మినీ ఎల్ఈడీ గేమింగ్ మానిటర్‌ను శామ్‌సంగ్ ఆవిష్కరించింది. దీని పేరు శామ్‌సంగ్ ఒడిస్సీ నియో జీ 9 (Odyssey Neo G9). ఇది క్వాంటమ్ మాట్రిక్స్ టెక్నాలజీతో పనిచేయనుంది. ఈ గేమింగ్ మానిటర్ కర్వ్‌డ్ (curved) డిస్‌ప్లేతో రానుంది. గేమ్‌లో లీనమైన అనుభవం రావడం కోసం ఇందులో క్వాంటమ్ హెచ్‌డీఆర్ 2000ను ఉపయోగించారు. గతేడాది శామ్‌సంగ్ నుంచి వచ్చిన ఒడిస్సీ జీ 9కు తర్వాతి వెర్షన్‌గా ఇది విడుదల కానుంది. కొత్తగా వచ్చిన ఒడిస్సీ జీ 9లో క్వాంటమ్ మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీని ఉపయోగించారు.

సాధారణ ఎల్ఈడీలతో పోలిస్తే ఇది 1/40 ఎత్తును కలిగి ఉంటుంది. క్వాంటం మినీ ఎల్ఈడీలో సన్నని మైక్రో లేయర్‌లు కూడా ఉన్నాయి. స్క్రీన్ సైజ్ ఆప్టిమైజర్, బ్లాక్ ఈక్వలైజర్, లో ఇన్‌పుట్ లాగ్ మోడ్, రీఫ్రెష్ రేట్ ఆప్టిమైజర్, సూపర్ ఏరీనా గేమింగ్ యూఎక్స్ వంటి గేమింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 
నియో జీ 9 ధర.. 
ప్రపంచవ్యాప్తంగా శామ్‌సంగ్ ఒడిస్సీ నియో జీ 9 ప్రీ ఆర్డర్స్ జూలై 29 నుంచి ప్రారంభం అవుతాయి. దీని సేల్ ఆగస్టు 9వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దీని ధర గురించిన వివరాలను శామ్‌సంగ్ ఇప్పటివరకు వెల్లడించలేదు. దీని ధర సుమారు రూ.1,86,300 (2,499.99 డాలర్లు)గా ఉండే అవకాశం ఉందని ది వెర్జ్ నివేదిక వెల్లడించింది.  
ఫీచర్లు ఇవే.. 

  • శామ్‌సంగ్ ఒడిస్సీ నియో జీ 9 అల్ట్రా వైడ్ 49 అంగుళాల డ్యూయల్ క్వాడ్ హెచ్‌డీ (5,120×1,440 పిక్సెల్స్) డిస్‌ప్లేతో రానుంది. హెచ్‌డీఆర్+ సపోర్టుతో వస్తుంది.
  • స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 32:9గా, రీఫ్రెష్ రేటు 240 Hzగా ఉంది. రెస్పాన్స్ సమయం 1మిల్లీసెకనుగా ఉండనుంది. వీక్షణ కోణం (viewing angle) 178 డిగ్రీలుగా ఉంది. కాంతి వనరులపై అధిక నియంత్రణ కోసం 12-బిట్ గ్రేడేషన్ ఉంటుంది.
  • క్వాంటం మినీ ఎల్ఈడీ డిస్‌ప్లేలో 2,048 డిమ్మింగ్ జోన్లు ఉన్నాయి. 
  • క్వాంటం హెచ్‌డీఆర్ గరిష్టంగా 2000 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. దీనికి వెర్బాండ్ డ్యూచర్ ఎలెక్ట్రోటెక్నికర్ (VDE ) నుంచి ధృవీకరణ కూడా ఉంది. స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో 1,000,000:1గా ఉంది. 
  • మానిటర్‌కి ఉన్న 1000ఆర్ కర్వేచర్‌కు టీయూవీ (TÜV) రీన్లాండ్ ఐ కంఫర్ట్ సర్టిఫికేట్ కూడా లభించింది. 
  • అద్భుతమైన గేమ్ ప్లే అనుభూతి కోసం ఇందులో NVIDIA జి సింక్ & ఏఎండీ ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో ఉన్నాయి.
  • డిస్‌ప్లే.. గ్లాసీ వైట్ ఎక్స్‌టీరియర్‌తో ఉంటుంది.
  • అలాగే 52 కరల్ రేర్ ఇన్ఫినిటీ కోర్ లైటింగ్ సిస్టమ్, 5 లైటింగ్ ఎఫెక్టు ఆప్షన్లు ఇందులో ఉంటాయి.
  • మానిటర్ కోర్ సింక్ ఫీచరుతో రకరకాల రంగులతో ఇది అందుబాటులోకి రానుంది. 

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget