Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Samsung New TV: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ శాంసంగ్ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. 8కే, 4కే, ఓఎల్ఈడీ డిస్‌ప్లేలతో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి.
Samsung Neo QLED 8K TV Series: శాంసంగ్ మనదేశంలో బుధవారం నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ 4కే, ఓఎల్ఈడీ టీవీ మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఈ పోర్ట్‌ఫోలియోలో ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్లను కూడా అందించనున్నారు. 55 అంగుళాల నుంచి 98 అంగుళాల వరకు వేర్వేరు స్క్రీన్ సైజుల్లో ఈ డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం పోర్ట్‌ఫోలియోలో టాప్ ఎండ్ వేరియంట్ అయిన శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కేలో ఎన్‌క్యూ8 ఏఐ జెన్ 3 ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మెరుగైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ టీవీ సిరీస్‌లో అందించనున్నారు. నియో క్యూఎల్ఈడీ మోడల్స్‌లో ప్రత్యేకంగా గేమింగ్ కోసం మోషన్ ఎక్సెలరేటర్ టెక్నాలజీని కూడా అందించారు.
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే ధ
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే టీవీల ధర మనదేశంలో రూ.3,19,990 నుంచి ప్రారంభం కానుంది.
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 4కే ధర
ఈ సిరీస్ టీవీల ధర మనదేశంలో రూ.1,39,990 నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రారంభ వేరియంట్ ధర. వేరియంట్‌ను బట్టి దీని ధర మారుతూ ఉంటుంది.
శాంసంగ్ ఓఎల్ఈడీ టీవీ ధర
శాంసంగ్ ఓఎల్ఈడీ టీవీ సిరీస్ ధర మనదేశంలో రూ.1,64,990 నుంచి మొదలవుతుంది. టీవీ స్క్రీన్ సైజు పెరిగే కొద్దీ దీని ధర పెరుగుతూ ఉంటుంది.
స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద 2024 స్మార్ట్ టీవీ సిరీస్‌ను కొనుగోలు చేసినట్లయితే రూ.79,900 విలువైన సౌండ్ బార్‌ను ఉచితంగా అందించనున్నారు. మోడల్‌ను బట్టి రూ.29,900 విలువైన మ్యూజిక్ ఫ్రేమ్, రూ.59,900 విలువైన ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ కూడా ఉచితంగా లభించనున్నాయి. ఏప్రిల్ 30వ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. దీంతో పాటు మోడల్‌ను బట్టి 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ 4కే, ఓఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు
శాంసంగ్ కొత్త క్యూఎల్ఈడీ 8కే స్మార్ట్ టీవీలు రెండు మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. అవే క్యూఎన్900డీ, క్యూఎన్800డీ. 75 అంగుళాలు, 85 అంగుళాల స్క్రీన్ సైజుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 4కే మోడల్స్‌లో క్యూఎన్85డీ, క్యూఎన్90డీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాలు, 85 అంగుళాలు, 98 అంగుళాల మోడళ్లలో కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ ఓఎల్ఈడీ టీవీ మోడల్స్‌లో ఎస్95డీ, ఎస్90డీ ఉన్నాయి. ఇవి 55 అంగుళాలు, 65 అంగుళాలు, 77 అంగుళాలు, 83 అంగుళాల సైజుల్లో మార్కెట్లో ఉన్నాయి. నియో క్యూఎల్ఈడీ 8కే టీవీల్లో ఎన్‌క్యూ8 ఏఐ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 4కే టీవీలు, ఓఎల్ఈడీ టీవీల్లో ఎన్‌క్యూ4 ఏఐ జెన్ 2 ప్రాసెసర్ అందుబాటులో ఉంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే రేంజ్ టీవీల్లో ఏఐ పిక్చర్ టెక్నాలజీ, ఏఐ అప్‌స్కేలింగ్ ప్రో, ఏఐ మోషన్ ఎన్‌హేన్సర్ ప్రో, రియల్, డెప్త్ ఎన్‌హేన్సర్ ప్రో, ఏఐ కస్టమైజేషన్ మోడ్, ఏఐ ఎనర్జీ మోడ్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లకు తగ్గట్లు వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేసేలా శాంసంగ్ ఏఐ సౌండ్ టెక్నాలజీని కూడా అందించారు. ఈ టీవీ సిరీస్‌లో ఏఐ ఆటో గేమ్ మోడ్‌ను కూడా అందించారు. మీరు ఆడే గేమ్, జోనర్‌ను బట్టి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ సెట్టింగ్స్‌ను ఇది అడ్జస్ట్ చేస్తుంది.
కలర్ ఆక్యురసీ, డాల్బీ అట్మాస్‌ల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి పాన్‌టోన్ వాలిడేటెడ్ టీవీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఈ ఓఎల్ఈడీ టీవీలు 144 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. మోషన్ ఎక్సెలరేటర్ వంటి ఫీచర్లను కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.
ఈ అన్ని టీవీల్లోనే శాంసంగ్ టీవీ ప్లస్‌కు యాక్సెస్ ఉంది. దీని ద్వారా 100కు పైగా టీవీ ఛానెళ్లను ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. దీంతో పాటు స్మార్ట్ హోం డివైస్‌లను కంట్రోల్ చేయడం కోసం బిల్ట్ ఇన్ ఐవోటీ హబ్ కూడా ఈ టీవీల్లో అందించారు. స్మార్ట్ మొబైల్ కనెక్ట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌నే టీవీ రిమోట్‌గా ఉపయోగించవచ్చు. దీంతో పాటు శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది