Samsung Affordable 5G Phone: శాంసంగ్ కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - ఇంకో వారంలోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ మనదేశంలో ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అమెజాన్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా చూడవచ్చు. ఇందులో 5ఎన్ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉండనుందని సమాచారం. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర వివరాలు తెలియాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 5ఎన్ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండనుంది. రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్ ఫోన్‌లో రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
దీనికి సంబంధించిన పలు స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీకయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ13, శాంసంగ్ గెలాక్సీ ఏ23, శాంసంగ్ గెలాక్సీ ఎం23 5జీలతో పాటు ఈ ఫోన్ గతంలో గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ లీకుల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉండనుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?