Samsung New TWS Earbuds: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఇయర్‌బడ్స్ వచ్చేది ఎప్పుడు - ఫీచర్లు కూడా లీక్!
Samsung Galaxy Buds 3 Pro Launch: శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయి.
![Samsung New TWS Earbuds: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఇయర్‌బడ్స్ వచ్చేది ఎప్పుడు - ఫీచర్లు కూడా లీక్! Samsung Galaxy Buds 3 Pro Reportedly Launching Soon Check Details Samsung New TWS Earbuds: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఇయర్‌బడ్స్ వచ్చేది ఎప్పుడు - ఫీచర్లు కూడా లీక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/223c5d4d52ae6e1658e9d620597023821696408395616402_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Samsung Galaxy Buds 3 Pro: శాంసంగ్ తన ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్ లాంచ్ చేయనున్న ఈ ఇయర్‌బడ్స్... కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌తో పాటు రానుంది. అంటే వచ్చే సంవత్సరం ఇవి వినియోగదారుల చేతుల్లోకి రానున్నాయన్న మాట. అవే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో.
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో ఫీచర్లు ఇలా...
శాంసంగ్ నుంచి రానున్న ఈ తాజా ఇయర్‌బడ్స్... గెలాక్సీ బడ్స్ 2 ప్రోకి తర్వాతి మోడల్‌గా ఉంటాయి. గెలాక్సీ బడ్స్ 3 ప్రో ఫీచర్ల గురించి చెప్పాలంటే... ఇది ట్రూ వైర్‌లెస్ టెక్నాలజీతో రానుంది. ఇది సౌండ్ క్వాలిటీని కూడా అద్భుతంగా మెరుగుపరుస్తుంది.
అదనంగా గెలాక్సీ బడ్స్ 3 ప్రోలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో కూడిన ప్రీమియం వైర్‌లెస్ ఆడియో హెడ్‌సెట్ టూ వే స్పీకర్‌లు కూడా అందించనున్నారు. ఇవి 24 బిట్ హై ఫై ఆడియో సపోర్ట్‌తో వస్తాయి. గెలాక్సీ బడ్స్ 3 ప్రో గురించి ఇంకా శాంసంగ్ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ బడ్స్‌ను జెడ్ ఫోల్డ్, ఫ్లిప్ ఫోన్‌ల కొత్త వెర్షన్‌తో పాటు లాంచ్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో, గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఎలా ఉన్నాయి?
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో ఈ సంవత్సరమే లాంచ్ అయ్యాయి. లాంచ్ అయినప్పుడు వీటి ధర రూ.17,999గా ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ రూ.9,999 ధరతో మనదేశంలో లాంచ్ అయ్యాయి. యూకేలో వీటి ధర 109 యూరోల (సుమారు రూ.8,000) ధరతో కంపెనీ తీసుకువచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌లో టచ్ కంట్రోల్స్‌ను అందించారు. దీంతో పాటు యాక్టివ్ క్యాన్సిలేషన్ సపోర్ట్ (ఏఎన్‌సీ) ఫీచర్ కూడా ఉంది. ఇది కాకుండా స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్2 రేటింగ్ బిల్డ్ అందించారు. ఏఎన్‌సీ ఆన్ చేస్తే ఇది గరిష్టంగా ఆరు గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదు. ఈ బడ్స్ SBC, AAC ఆడియో కోడెక్‌లను సపోర్ట్ చేస్తుంది.
శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్34 5జీ మొబైల్‌పై ఇటీవలే భారీ తగ్గింపు అందించింది. ఈ ఫోన్‌కు సంబంధించి రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.18,999 కాగా, ఇప్పుడు రూ.16,499కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు తగ్గింపు లభించనుంది. వీటన్నిటితో కలిపి ఈ ఫోన్ రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.20,999గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు దీన్ని రూ.18,499కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో రూ.16,999కే అందుబాటులో ఉండనుంది. నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు రూ.1,882 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ రంగుల్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ కొనుగోలు చేయవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)