News
News
వీడియోలు ఆటలు
X

Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?

శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

FOLLOW US: 
Share:

Samsung Galaxy A34 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇందులో సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కూడా అందించారు. ఈ మొబైల్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధరను రూ.32,999గా ఉంది.

అసమ్ లైమ్, అసమ్ గ్రాఫైట్, అసమ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ పని చేయనుంది. నాలుగు జనరేషన్ల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ భరోసా ఇచ్చింది.. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. ఈ మొబైల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... దీని వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. డాల్బీ టెక్నాలజీ ఉన్న స్టీరియో స్పీకర్లను ఇందులో అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ అందుబాటులో ఉంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు.

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీని కంపెనీ ఏ34తో పాటు లాంచ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధరను రూ.40,999గా నిర్ణయించారు.

Published at : 23 Mar 2023 06:55 PM (IST) Tags: samsung Samsung New 5G Phone Samsung Galaxy A34 5G Samsung Galaxy A34 5G Price in India Samsung Galaxy A34 5G Features Samsung A34 5G Sale

సంబంధిత కథనాలు

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!

Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!

Coin On Railway Track: ట్రైన్‌ ట్రాక్‌పై నాణెం పెడితే రైలు బండి పట్టాలు తప్పుతుందా?

Coin On Railway Track: ట్రైన్‌ ట్రాక్‌పై నాణెం పెడితే రైలు బండి పట్టాలు తప్పుతుందా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్