Samsung Galaxy A03 Launch: రూ.10 వేలలోనే శాంసంగ్ కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మనదేశంలో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ03. దీని ధర రూ.10,499 నుంచి ప్రారంభం కానుంది.
Samsung Galaxy A03: శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ కొత్త శాంసంగ్ ఫోన్ గతేడాది నవంబర్‌లో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. మోటొరోలా మోటో ఈ40, రియల్‌మీ సీ25వై, టెక్నో స్పార్క్ 8సీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ధర (Samsung Galaxy A03 Price)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,499గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం, రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ పోర్టళ్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్పెసిఫికేషన్లు (Samsung Galaxy A03 Specifications)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ కోర్ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
View this post on Instagram