AI Washing Machine: ఏఐ వాషింగ్ మెషీన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంత? స్పెషాలిటీ ఏంటి?
Samsung New Washing Machine: శాంసంగ్ మనదేశంలో కొత్తగా ఏఐ వాషింగ్ మెషీన్లను లాంచ్ చేసింది. ఇందులో ఎన్నో ఫీచర్లు అందించారు.
Samsung AI Ecobubble Washing Machines: దక్షిణ కొరియా బ్రాండ్ శాంసంగ్... భారతదేశంలో తన సరికొత్త ఏఐ ఎకోబబుల్ సిరీస్ వాషింగ్ మెషీన్లను లాంచ్ చేసింది. ఇది ఫ్రంట్ లోడ్ డిజైన్‌లో రూపొందించిన వాషింగ్ మెషీన్. పూర్తిగా ఆటోమేటిక్ కావడం విశేషం. ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఈ వాషింగ్ మెషీన్ 50 శాతం వేగంగా బట్టలు ఉతుకుతుందని శాంసంగ్ తెలిపింది.
శాంసంగ్ తన ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషీన్‌పై రెండు సంవత్సరాల ఫుల్ వారంటీని, మోటార్‌పై 20 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ప్రస్తుతానికి కొత్త వాషింగ్ మెషీన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. శాంసంగ్ ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషీన్ ఫీచర్లు, ధర వివరాలు చూద్దాం.
శాంసంగ్ ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషీన్ ఫీచర్లు
- శాంసంగ్ ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషీన్ పూర్తిగా ఆటోమేటిక్, 11 కిలోల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
- ఇది ఒక సింగిల్ గ్లాస్ డోర్, కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్, ఫ్రంట్ లోడ్ డిజైన్‌ను కలిగి ఉంది.
- డిటర్జెంట్‌ను బుడగలుగా మార్చే ఎకోబబుల్ టెక్నాలజీ ఈ మెషీన్‌లోని అత్యంత ప్రత్యేకత. ఇది మురికిని త్వరగా తొలగిస్తుంది కాబట్టి ఇది త్వరగా బట్టలు ఉతకడానికి సహాయపడుతుంది.
- ఈ మెషీన్ దుస్తులను కూడా గుర్తించగలదు. బెస్ట్ వాష్‌ను అందించడానికి వాష్ సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది.
- శాంసంగ్ తన కొత్త వాషింగ్ మెషీన్లు బట్టల లోడ్ ఆధారంగా వాష్ సైకిల్‌ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా 70 శాతం వరకు విద్యుత్‌ను పొదుపు చేస్తుందని చెప్పవచ్చు.
- ఇది కేవలం 39 నిమిషాల్లో పూర్తి లోడ్ దుస్తులను వాష్ చేయగలదు.
- ఇందులో ఉన్న క్విక్‌డ్రైవ్ ఫీచర్ లాండ్రీ సమయాన్ని 50 శాతం వరకు తగ్గిస్తుంది.
- ఈ మెషీన్ డీప్ క్లీనింగ్ కోసం స్టీమ్‌ను కూడా ఉపయోగిస్తుంది.
- దీని డిటర్జెంట్ ట్రే వాటర్ జెట్‌తో క్లీన్ అవుతుంది. తద్వారా వినియోగదారులు ట్రేని మాన్యువల్‌గా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు.
- శాంసంగ్ ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషిన్ స్మార్ట్ వైఫై కనెక్టివిటీని కూడా అందిస్తుంది.
- వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌ల్లో శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్‌ని ఉపయోగించి మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చు.
- ఈ మెషీన్ యూజర్ వాషింగ్ ప్యాటర్న్‌లు, అలవాట్లను గమనించి, వాటి ఆధారంగా సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ సెట్టింగ్స్ ఆధారంగా ఆ వ్యక్తికి అత్యంత అనుకూలమైన మోడ్‌ను మెషీన్ వినియోగదారులకు రికమెండ్ చేయగలదు.
- ఈ వాషింగ్ మెషీన్‌లో ఏఐ వాష్ (బట్టల బరువును గుర్తించి ప్రాథమిక వాష్ సైకిల్‌ను తెలియజేస్తుంది). ఏఐ డ్రైయింగ్ ఫీచర్ (బట్టల తేమ ఆధారంగా డ్రైయింగ్ సైకిల్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది). ఇందులో ఇంకా మరిన్ని ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
ఏఐ వాషింగ్ మెషిన్ ధర, సేల్ వివరాలు
కొత్త శాంసంగ్ ఏఐ ఎకోబబుల్ వాషింగ్ మెషిన్ ధర రూ.67,990 నుంచి ప్రారంభం అవుతుంది. దీని టాప్ మోడల్ ధర రూ.71,990గా ఉంది. ఈ వాషింగ్ మెషీన్లు శాంసంగ్ వెబ్‌సైట్‌లో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టల్స్, భారతదేశంలోని అన్ని ఇతర ప్రధాన ఎలక్ట్రానిక్ రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ పాత వాషింగ్ మెషీన్లపై రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా ఈఎంఐ లావాదేవీలపై కస్టమర్లు రూ. 10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?